ఐటీఎఫ్‌ టోర్నీలో మెయిన్‌ ‘డ్రా’కు సౌజన్య అర్హత  | Telngana Athlete Sowjanya Bavisetti Qualify Main Draw In ITAF | Sakshi
Sakshi News home page

ఐటీఎఫ్‌ టోర్నీలో మెయిన్‌ ‘డ్రా’కు సౌజన్య అర్హత 

Mar 1 2022 12:37 PM | Updated on Mar 1 2022 12:37 PM

Telngana Athlete Sowjanya Bavisetti Qualify Main Draw In ITAF - Sakshi

బెన్‌డిగో ఓపెన్‌ అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి సౌజన్య బవిశెట్టి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌లో సౌజన్య 7–5, 7–5తో మూడో సీడ్, భారత్‌కే చెందిన రుతుజా భోస్లేపై గెలిచింది. తొలి రౌండ్‌లో సౌజన్య 6–1, 6–0తో ఒలివియా (ఆస్ట్రేలియా)పై నెగ్గింది. మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సుజియోంగ్‌ జాంగ్‌ (దక్షిణ కొరియా)తో సౌజన్య ఆడుతుంది.

చదవండి: SA vs NZ: ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్‌ ఘన విజయం

Advertisement
 
Advertisement
Advertisement