Tajinder Toor: ఒలింపిక్స్‌కు తజిందర్‌ అర్హత

Tajinder Toor qualifies for Tokyo 2020 in shot put - Sakshi

షాట్‌పుట్‌లో కొత్త జాతీయ, ఆసియా రికార్డు నెలకొల్పిన భారత అథ్లెట్‌  

పాటియాలా: ఇండియన్‌ గ్రాండ్‌ప్రి–4 అథ్లెటిక్స్‌ మీట్‌లో మూడు జాతీయ రికార్డులు బద్దలయ్యాయి. పురుషుల షాట్‌పుట్‌ ఈవెంట్‌లో తజిందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌ కొత్త జాతీయ రికార్డు, ఆసియా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ మీట్‌లో పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల తజిందర్‌ ఇనుప గుండును 21.49 మీటర్ల దూరం విసిరాడు.

ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణం 21.10 మీటర్లను అతను అధిగమించాడు. 20.92 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తజిందర్‌ సవరిం చాడు. తజిందర్‌ ధాటికి 12 ఏళ్ల ఆసియా రికార్డు కూడా తుడిచి పెట్టుకుపోయింది. 21.13 మీటర్లతో 2009లో సుల్తాన్‌ అబ్దులుమ్‌ అల్‌ హెబ్షీ (సౌదీ అరేబియా) సాధించిన ఆసియా రికార్డును తజిందర్‌ బద్దలు కొట్టాడు.

ద్యుతీ చంద్‌ కూడా...
మహిళల 100 మీటర్ల విభాగంలో ఒడిశా స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ కూడా కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. ఆమె 11.17 సెకన్లలో రేసును ముగిం చి 11.21 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది.  4్ఠ100 మీటర్ల రిలేలో ద్యుతీ చంద్, హిమా దాస్, ధనలక్ష్మి, అర్చనలతో కూడిన భారత ‘ఎ’ జట్టు 43.37 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. 43.42 సెకన్ల తో 2016లో మెర్లిన్, జ్యోతి, శ్రావణి  ద్యుతీ బృం దం చేసిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.

జాతీయ రికార్డే కానీ...
మహిళల డిస్కస్‌ త్రోలో కమల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా కొత్త జాతీయ రికార్డు ప్రదర్శనను నమోదు చేసింది. కమల్‌ప్రీత్‌ డిస్క్‌ను 66.59 మీటర్ల దూరం విసిరింది. గత మార్చిలో ఫెడరేషన్‌ కప్‌లో కమల్‌ప్రీత్‌ 65.06 మీటర్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది. అయితే కమల్‌ప్రీత్‌ తాజా ప్రదర్శనను జాతీయ రికార్డుగా గుర్తించడం లేదు. రికార్డుగా గుర్తించాలంటే నిబంధనల ప్రకారం ఒక కేటగిరీలో కనీసం ముగ్గురు బరిలో ఉండాలి. సోమవారం జరిగిన మీట్‌లో కమల్‌ప్రీత్‌ కేటగిరీలో ఆమె ఒక్కరే పాల్గొన్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top