T20 WC 2021 IND Vs PAK: కెప్టెన్లుగా తొలి టి20 ప్రపంచకప్‌.. ఇద్దరూ ఇద్దరే

T20 World Cup 2021: Virat Kohli Vs Babar Azam Records As Captains - Sakshi

Virat Kohli Vs Babar Azam.. టీమిండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటేనే హైవోల్టేజ్‌తో కూడుకున్నది. అక్టోబర్‌ 24న జరగనున్న సమరానికి మేం సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే ఇరుజట్ల కెప్టెన్లు ప్రకటించారు. బాబర్‌ అజమ్‌ ఒక అడుగు ముందుకేసి ఇప్పటివరకు జరిగింది గతం.. ఈసారి చరిత్రను తిరగరాయబోతున్నాం అంటూ వీడియో విడుదల చేశాడు. మరోవైపు కోహ్లి కూడా తాను తగ్గేదే లే అన్నట్లుగా.. ధీటుగానే బదులిస్తున్నాడు. ఇక ఆదివారం జరిగే పోరులో విజేత ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ విషయం పక్కనపెడితే.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ఇటు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌కు వ్యక్తిగతంగా మంచి రికార్డులున్నాయి.

చదవండి: Virat Kohli: అజేయ 'విరాట్‌'.. పాక్‌పై అద్భుత రికార్డు కలిగిన టీమిండియా కెప్టెన్‌ 

బాబర్‌ అజమ్‌ ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంటే.. రెండో స్థానంలో విరాట్‌ కోహ్లి ఉన్నాడు. ఇక టి20 ర్యాంకింగ్స్‌లో బాబర్‌ రెండో స్థానంలో ఉంటే.. కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. పరుగుల పరంగా చూస్తే ఇద్దరు సమానంగా కనిపిస్తున్నారు. ఇంకో విశేషమేమిటంటే.. ఈ ఇద్దరికి కెప్టెన్లుగా ఇదే తొలి టి20 ప్రపంచకప్‌. 2016లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎంఎస్‌ ధోని కెప్టెన్‌గా ఉంటే.. పాకిస్తాన్‌కు షాహిద్‌ అఫ్రిది నాయకత్వం వహించాడు.  ఇక ముఖాముఖిగా కోహ్లి, బాబర్‌ అజమ్‌ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.

చదవండి: IND Vs Pak T20 WC 2021: అదంతా గతం.. ఈసారి చరిత్రను తిరగరాస్తాం: బాబర్‌ అజమ్‌

►ఇక టి20ల్లో కోహ్లి ఇప్పటివరకు టీమిండియాకు 45 మ్యాచ్‌ల్లో సారధ్యం వహించగా.. అందులో 27 మ్యాచ్‌లు గెలవగా.. 14 ఓడిపోయింది.

►పాకిస్తాన్‌ కెప్టెన్‌గా బాబర్‌ అజమ్‌ 28 మ్యాచ్‌ల్లో సారధ్యం వహించగా.. 15 మ్యాచ్‌లు గెలిచి 8 ఓడిపోయింది. 

►టి20ల్లో కెప్టెన్‌గా కోహ్లి విజయాల శాతం 65.11.. బాబర్‌ అజమ్‌ విజయాల శాతం 65.21గా ఉంది.

►టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి 45 మ్యాచ్‌ల్లో 48.45 సగటుతో 1502 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 94 నాటౌట్‌

►పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ అజమ్‌ 28 మ్యాచ్‌ల్లో 43.52 సగటుతో 914 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం. అత్యధిక స్కోరు 122 పరుగులు

►ఇక టి20 ప్రపంచకప్‌ల పరంగా చూసుకుంటే కోహ్లి 16 మ్యాచ్‌ల్లో 777 పరుగులు చేశాడు. మరోవైపు బాబర్‌ అజమ్‌కు మాత్రం ఇదే తొలి టి20 ప్రపంచకప్‌.

►ఓవరాల్‌గా కోహ్లి 90 టి20 మ్యాచ్‌లాడి 3159 పరుగులు చేయగా.. అందులో 28 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక బాబర్‌ అజమ్‌ 61 టి20ల్లో 2204 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 20 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top