శ్రీలంకతో మ్యాచ్‌.. బట్లర్‌ను ఊరిస్తున్న రికార్డు | T20 World Cup 2021: Jos Buttelr Requires 16 Complete 2000 Runs T20I | Sakshi
Sakshi News home page

ENG Vs SL : శ్రీలంకతో మ్యాచ్‌.. బట్లర్‌ను ఊరిస్తున్న రికార్డు

Nov 1 2021 4:20 PM | Updated on Nov 1 2021 4:24 PM

T20 World Cup 2021: Jos Buttelr Requires 16 Complete 2000 Runs T20I - Sakshi

Jos Buttelr Requires 16 Complete 2000 Runs T20I: టి20 ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్‌ శ్రీలంకతో తలపడనుంది. సూపర్‌ 12 దశలో ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు అందుకొని గ్రూఫ్‌ టాపర్‌గా ఉంది. సెమీస్‌ బెర్త్‌ దాదాపు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్‌ శ్రీలంకపై కూడా విజయం సాధిస్తే సెమీస్‌ వెళ్లేందుకు మోర్గాన్‌ సేనకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇక ఇంగ్లండ్‌ వికెట్‌ జోస్‌ బట్లర్‌ భీకరఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన గత మ్యాచ్‌లో 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులతో ఊచకోత కోశాడు. అతని ధాటికి ఇంగ్లండ్‌ 126 పరుగుల లక్ష్యాన్ని 11.4 ఓవర్లలో చేధించింది.

చదవండి: Jos Buttler: టి20 ప్రపంచకప్‌ 2021లో అత్యంత వేగవంతమైన అర్థశతకం

ఈ సందర్భంగా సూపర్‌ ఫామ్‌లో ఉన్న బట్లర్‌ను శ్రీలంకతో మ్యాచ్‌లో ఒక రికార్డు ఊరిస్తుంది. టి20 క్రికెట్‌లో 2వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 16 పరుగుల దూరంలో ఉ‍న్నాడు. ఇంగ్లండ్‌ తరపున మోర్గాన్‌ మాత్రమే టి20ల్లో రెండువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో బట్లర్‌ గనుక 16 పరుగులు చేస్తే టి20ల్లో 2వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. కాగా బట్లర్‌కు శ్రీలంకపై వ్యక్తిగతంగా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 256 పరుగులు సాధించాడు. అందులో ఐదు అర్థశతకాలు ఉన్నాయి.   

చదవండి: T20 WC 2021: లక్ష్య చేధనలో ఇంగ్లండ్‌ సరికొత్త రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement