T20 World Cup 2021: టీమిండియా.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే

T20 World Cup 2021: India Lost 2 Matches Consecutive After 22 Years ICC - Sakshi

Team India Loss 2 Matches Consecutive After 22 Years ICC Tournies.. టి20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది. అంతకముందు పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఒక ఐసీసీ టోర్నీల్లో టీమిండియా వరుసగా లీగ్‌ దశ(సూపర్‌ 12)లో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కావడం విశేషం.  

చదవండి: IND Vs NZ: ఏందయ్యా ఈ ఆటతీరు.. పాక్‌తో మ్యాచ్‌ చాలా బెటర్‌

ఇంతకముందు 1999 వన్డే వరల్డ్‌కప్‌లో మహ్మద్‌ అజారుద్దీన్‌ సారధ్యంలో టీమిండియా లీగ్‌ స్టేజీలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది.  ఆ తర్వాత 2007 వన్డే ప్రపంచకప్‌, (2009, 2010 టి20 ప్రపంచకప్‌)లలో టీమిండియా గ్రూఫ్‌ స్టేజీలో వెనుదిరిగినప్పటికీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మాత్రం ఓటమి పాలవ్వలేదు. అజారుద్దీన్‌ తర్వాత తాజాగా 22 ఏళ్ల తర్వాత కోహ్లి సారధ్యంలో టీమిండియా ఒక ఐసీసీ టోర్నీలో లీగ్‌ దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే. 

చదవండి: దారుణ ఆటతీరు.. టీమిండియా చెత్త రికార్డు

ఇక న్యూజిలాండ్‌ను ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓడించి 18 ఏళ్లవుతుంది. తాజాగా మరోసారి ఆ రికార్డును బ్రేక్‌ చేయడంలో విఫలమైంది. ఐసీసీ టోర్నీల్లో ఇరుజట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ 8-1 తేడాతో టీమిండియాపై రికార్డును మరింత మెరుగుపరచుకుంది. కాగా న్యూజిలాండ్‌ను చివరగా 2003 వన్డే ప్రపంచకప్‌లో సౌరవ్‌ గంగూలీ సారధ్యంలో టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top