T20 World Cup 2021: రేపటి నుంచే మరో మహా క్రికెట్‌ సంగ్రామం..

T20 World Cup 2021: ICC Mens T20 World Cup Details - Sakshi

T20 World Cup Details: ఐపీఎల్-2021 కోలాహలం ముగిసిన గంటల వ్యవధిలోనే మరో మహా సంగ్రామానికి తెరలేవనుంది. యూఏఈ వేదికగా రేపటి(అక్టోబర్ 17 ) నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఐదేళ్ల విరామం తరువాత జరగనున్న పొట్టి ప్రపంచ కప్‌లో ఈసారి అత్యధికంగా 16 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో తొలుత గ్రూప్‌-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్‌ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు జ‌రగనున్నాయి. అనంతరం మేజర్‌ జట్ల మధ్య సూప‌ర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్‌ 23 నుంచి ప్రారంభమవుతాయి. రేపటి తొలి గేమ్‌లో ఒమన్‌-పపువా న్యూ గినియా జట్లు తలపడతాయి. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. స్కాట్లాండ్‌ను ఢీకొట్టనుంది. 

గ్రూప్ ఏ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్ బీ: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఒమన్

ప్రతి జట్టు గ్రూపులోని ఇతర జట్టుతో ఓ మ్యాచ్‌లో తలపడుతుంది. రెండు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి రౌండ్( సూపర్ 12)కు చేరుకుంటాయి. అక్కడ ఈ జట్లు ఎనిమిది అగ్రశ్రేణి జట్లతో రెండు గ్రూపులుగా విభజించబడతాయి.

గ్రూప్ 1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, A1, B2
గ్రూప్ 2: భారత్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, B1, A2

ఇక్కడ కూడా ప్రతి జట్టు గ్రూపులోని ఇతర  జట్టుతో ఓ మ్యాచ్‌లో తలపడుతుంది. అనంతరం రెండు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌ దశలో గెలిచిన జట్టుకు రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. మ్యాచ్ టై అయిన పక్షంలో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. 

చదవండి: ధోని ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్‌.. ఐపీఎల్‌ ట్రోఫీతో పాటు..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top