IPL 2021: ధోని ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్‌.. ఫ్యామిలీలోకి మరొకరు?

IPL 2021: MS Dhoni And Sakshi Dhoni Expecting Their Second Child In 2022, Suresh Raina Wife Confirms

MS Dhoni And Sakshi Dhoni Expecting Their Second Child In 2022: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను నాలుగోసారి(2010, 2011, 2018, 2021) విజేతగా నిలిపి ఆ ఫ్రాంఛైజీ అభిమానులు గర్వపడేలా చేసిన మహేంద్ర సింగ్‌ ధోని.. తన ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్‌ కూడా చెప్పాడు. ధోని రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని అతని భార్య సాక్షి సింగ్‌ రావత్‌ స్నేహితురాలు, సురేశ్‌ రైనా భార్య ప్రియాంక రైనా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాక్షి రావత్‌ ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని.. వచ్చే ఏడాదిలో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వనుందని ప్రియాంక రైనా పేర్కొన్నట్లు సమాచారం. నిన్న సీఎస్‌కే ట్రోఫీ గెలిచిన అనంతరం సాక్షి, కుమార్తె జీవాతో కలిసి మైదానంలోకి వచ్చి సందడి చేశారు. ఆ సమయంలో సాక్షి బేబీ బంప్‌ స్పష్టంగా కనిపించడంతో ధోని అభిమానులు విషయాన్ని కన్‌ఫర్మ్‌ చేసుకున్నారు. దీంతో ధోని ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా లభించినట్లైంది. 


ఇదిలా ఉంటే, శుక్రవారం జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్​లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు.. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను 27 ప‌రుగుల తేడాతో ఓడించి, నాలుగోసారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32), రాబిన్ ఉతప్ప (31), మొయిన్ అలీ (37) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభ్​మన్ గిల్ (51) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిగతా బ్యాటర్లంతా తేలిపోవడంతో మోర్గాన్ సేన ఓటమిపాలై, మూడోసారి కప్‌కు గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది.
చదవండి: తీవ్ర విషాదం... గుండెపోటుతో యువ క్రికెటర్‌ మృతి
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top