IPL 2023 Final: 'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఎంటర్‌టైన్‌ చేసి తీరుతాం'

SK Captain MS Dhoni Comments During Toss Time Will Entertain Fans Today - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ మొదలైంది. వాస్తవానికి ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వ్‌ డే అయిన సోమవారానికి వాయిదా పడింది. అయితే ఇవాళ కూడా మ్యాచ్‌ జరుగుతుందా లేదా అన్న అనుమానం కలిగింది. కానీ వర్షం లేకపోవడంతో టాస్‌ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ ఎంచుకుంది. 

కాగా టాస్‌ అనంతరం సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''వర్షం పడే సూచనలు ఉండడంతో ముందుగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం.  ఒక క్రికెటర్‌గా మంచి ఆట ఆడాలని అనుకుంటాం.  నిన్న(ఆదివారం) జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌ల భాగంగా మేం మొత్తం డ్రెస్సింగ్‌ రూంకే పరిమితమయ్యాం. అయితే మాకంటే ఎక్కువగా బాధపడింది అభిమానులు.

నిన్నటి మ్యాచ్‌ కోసం రాత్రంతా ఎదురుచూసి నిరాశగా వెనుదిరిగారు. అయితే ఇవాళ వాళ్లకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కలుగుతుందని చిన్న నమ్మకం. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంటే ఐదు ఓవర్లు మ్యాచ్‌ ఆడే అవకాశాలుంటాయనుకున్నాం. కానీ దేవుడి దయవల్ల ఇవాళ 20 ఓవర్ల కోటా గేమ్‌ జరిగేలా ఉంది. అలా జరిగితేనే టోర్నీకి సరైన ముగింపు ఉంటుంది. ఇక క్వాలిఫయర్‌-1 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'' అంటూ తెలిపాడు.

చదవండి: IPL 2023 Final: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ సీఎస్‌కే అప్‌డేట్స్‌

వర్కింగ్‌ డే రోజున ఐపీఎల్‌ ఫైనల్‌.. ఉద్యోగుల సిక్‌లీవ్స్‌ కష్టాలు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top