#Dhoni: స్ట్రైక్‌రేటు 231.25.. సీఎస్‌కే ఓడిందా?!.. | "Didn't Realise...": MS Dhoni's Wife Sakshi Breaks The Internet With Her Post On CSK's Defeat | Sakshi
Sakshi News home page

#Dhoni: స్ట్రైక్‌రేటు 231.25.. సీఎస్‌కే ఓడిందా?!.. అట్లుంటది మనతోని

Apr 1 2024 6:43 PM | Updated on Apr 1 2024 6:43 PM

"Didn't Realise...": MS Dhoni's Wife Sakshi Breaks The Internet With Her Post On CSK's Defeat

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు మహేంద్ర సింగ్‌ ధోని. విశాఖపట్నంలో వింటేజ్‌ తలాను గుర్తుచేస్తూ ఈ చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ స్టేడియాన్ని హోరెత్తించాడు. 
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. కేవలం 16 బంతుల్లోనే.. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 37 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్‌-2024లో తొలిసారి బ్యాటింగ్‌ చేసి ఏకంగా 231.25 స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా(21)తో కలిసి ధోని ఆఖరి వరకు అజేయంగా నిలిచినా.. సీఎస్‌కేను గెలుపుతీరాలకు చేర్చలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ మేరకు సీఎస్‌కే విఫలం కావడంతో సీజన్‌లో తొలి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

అయితే, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడినా ధోని మాత్రం తన ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడనడంలో సందేహం లేదు. ఎలక్ట్రిక్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును ధోని అందుకున్నపుడు వైఎస్సార్‌ స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఆ సమయంలో ఒక్క క్షణంపాటు సీఎస్‌కేనే గెలిచిందేమో అన్న భావన కలిగిందనడం అతిశయోక్తి కాదు.

ధోని సతీమణి సాక్షి కూడా ఇదే మాట అంటున్నారు. తలా అవార్డు స్వీకరిస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘‘హాయ్‌ మహీ ఉన్నావా?!.. మనం మ్యాచ్‌ ఓడిపోయామంటే నమ్మబుద్ధి కావడం లేదు’’ అంటూ ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను కూడా ట్యాగ్‌ చేశారు. నెటిజన్లను ఆకర్షిస్తున్న సాక్షి పోస్టు వైరల్‌గా మారింది.

కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ సీజన్‌లో విశాఖ హోంగ్రౌండ్‌ అయినా.. మెజారిటీ ప్రేక్షకులు ధోని కోసం సీఎస్‌కే జెర్సీలతో స్టేడియానికి రావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేపై 20 పరుగులతో గెలిచినఢిల్లీ క్యాపిటల్స్‌ పదిహేడో ఎడిషన్‌లో తొలి విజయం అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement