పాకిస్తాన్ క్రికెట్‌లో కీలక పరిణామం.. బ్యాటింగ్‌ కోచ్‌గా ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌

T20 World Cup 2021: Hayden Philander Appointed Coaches - Sakshi

ఇస్లామాబాద్‌: టీ20 ప్రపంచకప్‌నకు ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక కోచ్‌లుగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఇద్దరు విదేశీయులకు అవకాశం కల్పించింది. ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ను  బ్యాటింగ్‌ కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వర్నన్ ఫిలందర్‌ను బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసింది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో విధ్వంసకర ఓపెనర్‌లలో ఒకడిగా పెరుపొందిన హెడెన్ 103 టెస్టులు, 161 వన్డేలు , 9 T20I లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రమీజ్ రాజా... తన మొదటి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక టీ20 జట్టు ప్రకటించిన నాటి నుంచి పాక్‌ క్రికెట్‌లో ముసలం రేగిన సంగతి తెలిసిందే. తమ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదనే కారణంగా పాకిస్తాన్‌  హెడ్‌కోచ్ మిస్బా వుల్‌ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

పాకిస్తాన్ టీ20 జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.

చదవండి: Gambhir: మనం ఇంకా రాహుల్ అసలైన బ్యాటింగ్ చూడలేదు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top