SCO Vs IRE: స్కాట్లాండ్‌పై ఐర్లాండ్‌ ఘన విజయం.. సూపర్‌ 12 ఆశలు సజీవం

T20 WC: Ireland Beat Scotland By 5 Wickets Has Super 12 Hopes Are-Alive - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూఫ్‌-బి క్వాలిఫయింగ్‌ పోరులో బుధవారం స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే టార్గెట్‌ను చేధించింది. ఐర్లాండ్‌ బ్యాటర్లు కర్టిస్‌ కాంఫర్‌(32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌ ఆడగా.. జార్జ్‌ డొక్‌రెల్‌(27 బంతుల్లో 39 నాటౌట్‌) కాంఫర్‌కు అండగా నిలిచాడు. అంతకముందు కీపర్‌ లోర్కాన్‌ టక్కర్‌ 20 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు 72 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన కాంఫర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌ ఓపెనర్‌ మైకెల్‌ జోన్స్‌ (55 బంతుల్లో 86 పరుగులు, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ రిచీ బెరింగ్‌టన్‌ 37 పరుగులతో రాణించాడు.ఐర్లాండ్‌ బౌలర్లలో కర్టీస్‌ కాంపర్‌ రెండు వికెట్లు తీయగా.. మార్‌ అడెయిర్‌, జోషువా లిటిల్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.


ఈ విజయంతో ఐర్లాండ్‌ తమ సూపర్‌-12 ఆశలు సజీవంగా ఉంచుకుంది. తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ చెరొక విజయంతో నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఓడిపోతే  ఆ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. కాబట్టి విండీస్‌కు జింబాబ్వేతో మ్యాచ్‌ కీలకం కానుంది.

చదవండి: T20 WC: ప్రపంచకప్‌.. సెమీస్‌ చేరేది ఆ జట్లే! ఇక విజేతగా..: సచిన్‌

అఫ్రిది యార్కర్‌ దెబ్బ.. ఆస్పత్రి పాలైన ఆఫ్గన్‌ ఓపెనర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top