Suryakumar Yadav: సూర్యకుమార్ డివిలియర్స్‌లాంటోడు: ఆసీస్ దిగ్గజం

రికీ పాంటింగ్ ప్రశంస
దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. అతని ఆట తనను ఎంతో ఆకట్టుకుందని, విధ్వంసకర శైలి ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకు తెస్తోందని పాంటింగ్ అన్నాడు. భారత జట్టు తరఫున అతను నాలుగో స్థానంలో ఆడటమే సరైందని పాంటింగ్ సూచించాడు. ‘సూర్యకుమార్ కూడా డివిలియర్స్ తరహాలోనే మైదానమంతా 360 డిగ్రీ షాట్లు ఆడతాడు. ల్యాప్ షాట్, కట్ షాట్, ర్యాంప్ షాట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.
లెగ్‌సైడ్ వైపు మరింత అద్భుతంగా ఆడే సూర్య అటు పేస్ బౌలింగ్, ఇటు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలడు. ఏ జట్టులోనైనా సూర్యకు చోటు ఖాయం. షాట్లు ఆడే సమయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆడే సూర్యకుమార్ ఆత్మవిశ్వాసం నన్ను ఆకర్షించింది. నాకు తెలిసి అతను మిడిలార్డర్‌లో ఆడటం సరైంది. మ్యాచ్‌ను సరిగా నడిపించడంతో పాటు చివర్లో క్రీజ్‌లో ఉంటే చెలరేగిపోగలడు’ అని ఆసీస్ మాజీ కెప్టెన్ విశ్లేషించాడు.
చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన
సంబంధిత వార్తలు