World Wrestling: 32 ఏళ్ల తర్వాత...

రోమ్ (ఇటలీ): సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. ప్రపంచ రెజ్లింగ్ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు 32 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో భారత యువ రెజ్లర్ సూరజ్ విజేతగా అవతరించాడు.
ఫైనల్లో సూరజ్ 11–0తో ఫరైమ్ ముస్తఫయెవ్ (అజర్‌బైజాన్)పై విజయం సాధించాడు. తద్వారా 1990లో పప్పూ యాదవ్ తర్వాత ప్రపంచ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో పసిడి పతకం నెగ్గిన భారత రెజ్లర్‌గా సూరజ్ గుర్తింపు పొందాడు.