breaking news
World Wrestling Championship
-
ప్రపంచ చాంపియన్ షిప్‌పోటీలకు అమన్, అంతిమ్
లక్నో: గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలి పతకంపై గురి పెట్టాడు. సెప్టెంబర్ 13 నుంచి 21వ తేదీ వరకు క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల ఫ్రీస్టయిల్ జట్లను సోమవారం ప్రకటించారు. రెండు రోజులపాటు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేశారు. 22 ఏళ్ల అమన్ జూన్‌లో మంగోలియాలో జరిగిన ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో కాంస్య పతకం గెలిచాడు. రెండు నెలల తర్వాత మళ్లీ మ్యాట్‌పైకి అడుగు పెట్టిన అమన్ చురుకైన కదలికలతో ఆకట్టుకున్నాడు. ట్రయల్స్‌లో తన ప్రత్యర్థులు సుమీత్, రాహుల్‌లపై అమన్ ‘టెక్నికల్ సుపిరీయారిటీ’ పద్ధతిలో (ప్రత్యరి్థపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించడం) అలవోకగా గెలిచాడు. ‘నా అత్యుత్తమ స్థాయికి చేరుకున్నానని భావిస్తున్నాను. పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధంగా ఉన్నా. ఏడాది తర్వాత బరిలోకి దిగిన మంగోలియా టోర్నీలో నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఓవరాల్‌గా నా ప్రదర్శనపట్ల సంతృప్తిగా ఉన్నా’ అని అమన్ వ్యాఖ్యానించాడు. 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2023 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన అమన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం ఇంకా పతకాల బోణీ కొట్టలేదు. మరోవైపు మహిళల విభాగంలో స్టార్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అంతిమ్ జాతీయ ట్రయల్స్‌లో తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా విజేతగా నిలిచింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన 20 ఏళ్ల అంతిమ్ ఇప్పటికే ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో, గ్రాండ్‌ప్రి సిరీస్ టోరీ్నల్లో, అండర్–20, అండర్–17 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించింది. భారత పురుషుల ఫ్రీస్టయిల్ జట్టు: అమన్ సెహ్రావత్ (57 కేజీలు), ఉదిత్ (61 కేజీలు), సుజీత్ కల్కాల్ (65 కేజీలు), రోహిత్ (70 కేజీలు), జైదీప్ (74 కేజీలు), అమిత్ (79 కేజీలు), ముకుల్ దహియా (86 కేజీలు), దీపక్ పూనియా (92 కేజీలు), విక్కీ (97 కేజీలు), రజత్ (125 కేజీలు). భారత మహిళల ఫ్రీస్టయిల్ జట్టు: అంకుశ్ (50 కేజీలు), అంతిమ్ (53 కేజీలు), నిశు (55 కేజీలు), తపస్య (57 కేజీలు), నేహా (59 కేజీలు), మనీషా (62 కేజీలు), వైష్ణవి (65 కేజీలు), సృష్టి (68 కేజీలు), జ్యోతి (72 కేజీలు), ప్రియా మలిక్ (76 కేజీలు). -
కాంస్యం నెగ్గిన మాన్సి
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఏకైక కాంస్య పతకం లభించింది. నాన్ ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించారు. అల్బేనియా రాజధాని టిరానాలో ముగిసిన ఈ టోర్నీలో మహిళల ఫ్రీస్టయిల్ 59 కేజీల విభాగంలో మాన్సి అహ్లావత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.కాంస్య పతక బౌట్లో మాన్సి 5–0తో కెనడా రెజ్లర్ లారెన్స్ బ్యూరెగార్డ్‌ను ఓడించింది. సెమీఫైనల్లో మాన్సి 1–4తో సుఖీ సెరెన్చిమెడ్ (మంగోలియా) చేతిలో ఓడిపోయింది. 65 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో మనీషా భన్వాలా 2–8తో మివా మొరికావా (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. బోపన్న జోడీ ఓటమి పారిస్ ఓపెన్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం కథ ముగిసింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 6–7 (13/15), 5–7తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–మెక్టిక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడింది. -
World Wrestling:32 ఏళ్ల తర్వాత...
రోమ్ (ఇటలీ): సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. ప్రపంచ రెజ్లింగ్ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు 32 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో భారత యువ రెజ్లర్ సూరజ్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో సూరజ్ 11–0తో ఫరైమ్ ముస్తఫయెవ్ (అజర్బైజాన్)పై విజయం సాధించాడు. తద్వారా 1990లో పప్పూ యాదవ్ తర్వాత ప్రపంచ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో పసిడి పతకం నెగ్గిన భారత రెజ్లర్‌గా సూరజ్ గుర్తింపు పొందాడు. -
నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
లాస్ వెగాస్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నేటి (మంగళవారం) నుంచి జరిగే ఈ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో తమ ఒలింపిక్ బెర్త్‌లను ఖాయం చేసుకునేందుకు భారత రెజ్లర్లు సిద్ధమవుతున్నారు. గాయంతో బాధపడుతున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఈ పోటీలకు దూరమవుతుండగా.. యోగేశ్వర్ దత్, నర్సింగ్ యాదవ్, అమిత్, మౌసమ్ తదితరులు ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగుతున్నారు. పురుషుల 74కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో తలపడుతున్న 26 ఏళ్ల నర్సింగ్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఏడాది కాలంగా ఈ విభాగంలో సుశీల్ కుమార్ గాయంతో పాల్గొనకున్నా నర్సింగ్ పలు విజయాలు సాధించాడు. ప్రతీ కేటగిరీలో టాప్-6 స్థానాల్లో వచ్చిన వారు ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంటారు. లండన్ గేమ్స్‌లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ (65కేజీ ఫ్రీస్టయిల్ ), అమిత్ కుమార్ (57కేజీ), మౌసమ్ ఖత్రి (97కేజీ).. మహిళల ఫ్రీస్టయిల్లో వెటరన్ గీతా ఫోగట్, బబిత, వినేశ్‌లపై పతకంతో పాటు బెర్త్ ఆశలున్నాయి.