నేషనల్‌ క్రికెట్ అకాడమీలో సందడి చేసిన సునీల్ ఛెత్రి.. వీడియో వైరల్‌ | Sunil Chhetri visits NCA camp in Bengaluru | Sakshi
Sakshi News home page

Sunil Chhetri : నేషనల్‌ క్రికెట్ అకాడమీలో సందడి చేసిన సునీల్ ఛెత్రి.. వీడియో వైరల్‌

May 9 2022 8:22 PM | Updated on May 9 2022 8:25 PM

Sunil Chhetri visits NCA camp in Bengaluru - Sakshi

సునీల్ ఛెత్రి

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీని సందర్శించాడు. అక్కడ శిక్షణ పొందుతున్న యువ క్రికెటర్‌లతో ఛెత్రి కాసేపు ముచ్చటించాడు. ప్రస్తుతం ఎన్​సీఏలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు  శిక్షణ పొందుతున్నారు. ఫీల్డింగ్ డ్రిల్‌లో ఆటగాళ్లతో పాటు ఛెత్రి కూడా పాల్గొన్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. "ఇండియన్ ఫుట్‌బాల్ కెప్టెన్,  లెజెండ్ సునీల్ ఛెత్రి ఎన్‌సీఎను సందర్శించాడు. అతడు ఫీల్డింగ్‌ డ్రిల్‌లో అదరగొట్టాడు. నార్త్ ఈస్ట్, ప్లేట్ టీమ్‌లకు చెందిన ఆటగాళ్లతో జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడిగా తన అనుభవాన్ని పంచుకున్నాడు" అంటూ బీసీసీఐ పోస్ట్‌కి క్యాప్షన్ జతచేసింది.

చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం..!

Advertisement
 
Advertisement
Advertisement