SRK Vs Virat Kohli Fan War: హద్దు మీరి.. అభ్యంతరకరంగా! నెట్టింట షారుక్‌, కోహ్లి ఫ్యాన్స్‌ రచ్చ! ఎందుకురా తన్నుకుంటారు?

SRK Vs Virat Kohli Fan War Takes Ugly Turn Ahead IPL 2023 - Sakshi

IPL 2023- Virat Kohli- Shah Rukh Khan: టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ట్విటర్‌ వేదికగా ఇరు సెలబ్రిటీల ఫ్యాన్స్‌.. ‘‘మా వాడు గొప్ప అంటే.. కాదు కాదు మా వాడే తోపు’’ అంటూ గొడవకు దిగుతున్నారు. కోహ్లి, షారుక్‌ కెరీర్‌కు సంబంధించిన విశేషాలు షేర్‌ చేస్తూ మీమ్స్‌తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.

అవమానకరరీతిలో
ఇద్దరిని పోల్చే విషయంలో పరిధి దాటి ప్రవర్తిస్తూ కోహ్లి, షారుక్‌లను అవమానపరిచే రీతిలో అభ్యంతరకర కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అసలు విషయమేమిటంటే.. ఐపీఎల్‌-2023 సీజన్‌ మార్చి 31న ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లిని ఉద్దేశించి షారుక్‌ ఫ్యాన్స్‌ కొందరు తక్కువ చేసే విధంగా మాట్లాడారు.

కింగ్‌ ది వేరే లెవల్‌
ఆర్సీబీ ఇంత వరకు ఒక్క టైటిల్‌ కూడా గెలవలేదని, షారుక్‌ సహ యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇప్పటికే రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిందని పేర్కొంటున్నారు. ఇందుకు కౌంటర్‌గా.. ప్రపంచంలోని ఉత్తమ నటుడు ఎవరని గూగుల్‌లో వెదికితే షారుక్‌ ఖాన్‌ రావడం లేదని.. అదే సమయంలో బెస్ట్‌ క్రికెటర్‌ అని సెర్చ్‌ కొట్టగానే కోహ్లి టాప్‌లో కనిపిస్తున్నాడంటూ స్క్రీన్‌షాట్లు షేర్‌ చేస్తున్నారు.

తగ్గేదేలే అంటున్న షారుక్‌ ఫ్యాన్స్‌
కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని.. కింగ్‌ది వేరే లెవల్‌ అంటున్నారు. ఇన్‌స్టాలో ఒక్కసారి ఫాలోయింగ్‌ చూస్తే మీకే తెలుస్తుందని చురకలు అంటిస్తున్నారు. షారుక్‌ ఫ్యాన్స్‌ సైతం తగ్గేదే లేదన్నట్లు.. కబి ఖుషి కబి ఘమ్‌ సినిమాలోని ఐకానిక్‌ సీన్స్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ.. కోహ్లి క్రికెట్‌ జీవితం మొత్తం ఈ ఒక్క ఎంట్రీ సీన్‌కు సాటిరాదంటూ కింగ్‌ ఫ్యాన్స్‌ను మరింత ఉడికిస్తున్నారు. దీంతో కోహ్లి, షారుక్‌ ఫ్యాన్స్‌ వార్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఎందుకురా తన్నుకుంటారు?
ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు.. ‘‘కోహ్లి, షారుక్‌.. ఎవరి రంగాల్లో వాళ్లు సూపర్‌స్టార్లు. సెలబ్రిటీల మధ్య గొడవలు ఉండవు. వాళ్లు కలిసే ఉంటారు. మధ్యలో మీరెందుకురా అనవసరంగా తన్నుకుంటున్నారు’’ అని హితబోధ చేస్తున్నారు.

కాగా ఐపీఎల్‌-2022లో ఫాఫ్‌ డుప్లెసిస్‌ సారథ్యంలోని ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరగా.. కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో ఏడోస్థానంతో గత సీజన్‌ను ముగించింది. ఇక ఈసారి కేకేఆర్‌ సారథి శ్రేయస్ అయ్యర్‌ దూరం కాగా.. అతడి స్థానంలో నితీశ్‌ రాణాకు యాజమాన్యం పగ్గాలు అప్పగించింది. 

చదవండి: Steve Smith: ఐపీఎల్‌-2023.. నేను చేరబోయే టీమ్‌ అదే: స్టీవ్‌ స్మిత్‌
PAK Vs AFG: చారిత్రాత్మక విజయం.. ఆఫ్గన్‌ సుందరి మళ్లీ వచ్చేసింది
ఐపీఎల్‌-2023లో బద్దలయ్యేందుకు రెడీగా రికార్డులివే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top