SL vs BAN: శ్రీలంక భారీ స్కోరు | Sri Lanka Vs Bangladesh 2nd Test SL Score 469 Loss Of 6 Wickets | Sakshi
Sakshi News home page

SL vs BAN: శ్రీలంక భారీ స్కోరు

May 1 2021 8:24 AM | Updated on May 1 2021 8:29 AM

Sri Lanka Vs Bangladesh 2nd Test SL Score 469 Loss Of 6 Wickets - Sakshi

ఒషాడా ఫెర్నాండో

పల్లెకెలె: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక భారీ స్కోరు చేసింది. ఆట రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 291/1తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక శుక్రవారం వెలుతురు మందగించి ఆట నిలిపి వేసే సమయానికి 155.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 469 పరుగులు సాధించింది. వెలుతురులేమి కారణంగా రెండో రోజు కేవలం 65.5 ఓవర్ల ఆట సాధ్యపడింది. ఓపెనర్‌ తిరిమన్నె (140; 15 ఫోర్లు) తన ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరుకు మరో తొమ్మిది పరుగులు జోడించి అవుటయ్యాడు.

ఇక సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఒషాడా ఫెర్నాండో (81; 8 ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం నిరోషన్‌ డిక్‌వెలా (64 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), రమేశ్‌ మెండిస్‌ (22 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ మూడు వికెట్లు తీశాడు.     

చదవండి: పదేళ్ల తర్వాత శ్రీలంక ఓపెనర్లు తొలిసారిగా..

Advertisement
 
Advertisement
Advertisement