కమిన్స్‌లా కాదు.. ఇషాన్‌ కిషన్‌పై జహీర్‌ ఖాన్‌ ఫైర్‌! | SRH missing Cummins captaincy: Zaheer Khan slams Ishan Kishan | Sakshi
Sakshi News home page

SRH: కమిన్స్‌లా కాదు.. ఇషాన్‌ కిషన్‌పై జహీర్‌ ఖాన్‌ ఫైర్‌!

Apr 13 2026 6:00 PM | Updated on Apr 13 2026 6:10 PM

SRH missing Cummins captaincy: Zaheer Khan slams Ishan Kishan

ఐపీఎల్‌-2026 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడి పరాజయంతో తాజా ఎడిషన్‌ మొదలుపెట్టింది ఎస్‌ఆర్‌హెచ్‌. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ఘన విజయం సాధించినా.. అదే జోరు కొనసాగించలేకపోయింది.

జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు
సొంతమైదానం ఉప్పల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌.. చివరగా ముల్లన్‌పూర్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలోనూ చిత్తుగా ఓడిపోయింది. తదుపరి మ్యాచ్‌లో ఉప్పల్‌ వేదికగా సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఆస్ట్రేలియా స్టార్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ జట్టుతో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని జహీర్‌ ఖాన్‌ అన్నాడు. అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా ఉన్న టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ వ్యూహాలను అమలు చేయడంలో విఫలమవుతున్నాడని విమర్శించాడు.

కమిన్స్‌లా కాదు.. క్లారిటీ లేదు!
ఈ మేరకు క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ శర్మ, ట్రవిస్‌ హెడ్‌ ఫామ్‌లోకి వచ్చారు. ఇషాన్‌ కిషన్‌ మాత్రం బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆరంభంలో బాగానే ఆడినా అదే జోరును కొనసాగించలేకపోతున్నాడు.

కెప్టెన్‌గానూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ప్యాట్‌ కమిన్స్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. అతడి కెప్టెన్సీలో ఒక స్పష్టత ఉంటుంది. కానీ ఇషాన్‌ విషయంలో అది మిస్సయ్యింది. తాను ఏమనుకుంటున్నాడో జట్టుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు.

తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న ఇషాన్‌ కిషన్‌ నాయకత్వ ప్రణాళికల్లో లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పొరపాటును సరిచేసుకుంటేనే సానుకూల ఫలితాలు వస్తాయి’’ అని జహీర్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్‌లో ఇషాన్‌ కిషన్‌ చేసిన పరుగులు వరుసగా.. 80, 14, 1, 27.

చదవండి: ‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement