స్పెయిన్‌ ‘హ్యాట్రిక్‌’ | The Spanish team registered a hat trick victory | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌ ‘హ్యాట్రిక్‌’

Jun 26 2024 3:34 AM | Updated on Jun 26 2024 11:46 AM

The Spanish team registered a hat trick victory

డసెల్‌డార్ఫ్‌ (జర్మనీ): యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో మాజీ చాంపియన్‌ స్పెయిన్‌ జట్టు ‘హ్యాట్రిక్‌’ విజయం నమోదు చేసింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా అల్బేనియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌ లో స్పెయిన్‌ 1–0 గోల్‌ తేడాతో గెలిచింది. ఆట 13వ నిమిషంలో స్పెయిన్‌ జట్టుకు ఫెరాన్‌ టోరెస్‌ ఏకైక గోల్‌ అందించాడు. మూడు విజయాలతో స్పెయిన్‌ తొమ్మిది పాయింట్లతో గ్రూప్‌ ‘బి’ టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 

గ్రూప్‌ ‘బి’లో భాగంగా క్రొయేషియా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇటలీ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. క్రొయేíÙయా తరఫున లూకా మోడ్రిచ్‌ (55వ ని.లో), ఇటలీ తరఫున జకాగ్ని (90+8వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. యూరో టోర్నీ చరిత్రలో గోల్‌ చేసిన అతి పెద్ద వయస్కుడిగా మోడ్రిచ్‌ (38 ఏళ్ల 289 రోజులు) గుర్తింపు పొందాడు. 

నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఇటలీ జట్టు కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్‌ ‘డి’లో జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 3–2తో నెదర్లాండ్స్‌ను ఓడించగా... ఫ్రాన్స్, పోలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ‘డి’ గ్రూప్‌ నుంచి ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement