Sourav Ganguly Resignation: BCCI Secretary Jay Shah Gives Clarity On Rumours - Sakshi
Sakshi News home page

Sourav Ganguly: పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన సౌరవ్‌ గంగూలీ

Jun 2 2022 12:06 AM | Updated on Jun 2 2022 9:31 AM

Sourav Ganguly Has Not Resigned, Clarifies BCCI Secretary Jay Shah  - Sakshi

కొత్త ప్ర‌యాణం ప్రారంభించ‌బోతున్నానంటూ బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ బుధవారం (జూన్‌ 1) సాయంత్రం చేసిన ట్వీట్‌ దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. అయితే సదరు ట్వీట్‌పై దాదా తాజాగా వివరణ ఇచ్చాడు. తన పొలిటికల్‌ ఎంట్రీపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. కొత్త ప్ర‌యాణ‌మంటూ తాను చేసిన ట్వీట్‌ను కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని దుయ్యబట్టాడు.

తాను ఓ ఎడ్యుకేష‌న‌ల్ యాప్‌ను ప్రారంభించాన‌ని, ఇది ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందుబాటులో ఉంటుంద‌ని బుధ‌వారం రాత్రి మీడియా ముందు వివరణ ఇచ్చాడు. తాను యధాతథంగా బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతానని కన్ఫర్మ్‌ చేశాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా దృవీకరించాడు. దీంతో గంగూలీ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై జరుగుతున్న ప్ర‌చారానికి తెరపడినట్లైంది. కాగా, ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో గంగూలీ రెండుసార్లు భేటీ కావడంతో దాదా పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమని సర్వత్రా ప్రచారం జరిగింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement