IPL 2023: అదే మా ఓటమికి కారణం.. అస్సలు ఊహించలేదు! ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు

Skipper Aiden Markram Slams SRH Batters For Lack Of Intent - Sakshi

ఐపీఎల్‌-2023లో వరుసగా ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో ఓటమి చవిచూసింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ పరాజయం పాలైంది. బ్యాటింగ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఆరెంజ్‌ ఆర్మీ.. 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌ స్పందించాడు. బ్యాటింగ్‌లో వైఫల్యంతోనే ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైం అని మార్‌క్రమ్‌ ఒప్పుకున్నాడు.

"మేం బ్యాటింగ్‌లో మళ్లీ విఫలమయ్యాం. కనీసం గెలవాలన్న కసి కూడా మా ‍బ్యాటర్లలో కనిపించలేదు. మ్యాచ్‌ సగం వరకు మేమే విజయం సాధిస్తామని భావించాను. కానీ ఒక్క సారిగా మా బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. అదే మా ఓటమిని శాసించింది. అలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. దురదృష్టవశాత్తూ మేం విజయం సాధించలేకపోతున్నాం.

మా బాయ్స్‌ స్వేచ్చగా బ్యాటింగ్ చేసే విషయంపై ఫోకస్ పెట్టాలి. అదే విధంగా మా ఆటగాళ్లు ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. లేదంటే ముందుకు వెళ్లడం కష్టం. మేము ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాలని భావించాం. కానీ మా బౌలర్లు అ‍త్యుత్తమంగా రాణించనప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం చేతులెత్తేశాం. ఈ మ్యాచ్‌లో మా ఇంటెంట్‌ అస్సలు బాగోలేదు. మా బౌలర్లు ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టు అద్భుతంగా రాణించారు.

మా తర్వాతి మ్యాచ్‌ల్లో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం" అని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో మార్క్‌రమ్‌ పేర్కొన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన కెప్టెన్‌ మార్‌క్రమ్‌పై అభిమానులు మండిపడుతున్నారు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మార్‌క్రమ్‌ కేవలం 3 పరుగులు మాత్రమే పెవిలియన్‌కు చేరాడు. దారుణ ప్రదర్శన కనబరిచి ఓటమికి షాక్‌లు చెప్పుతున్నావు అంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
చదవండి: IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఘనత.. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలి సారి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top