IND vs AUS: గట్టిగా అరిస్తే కాదు గిల్.. అది ఆటలో చూపించాలి! వీడియో వైరల్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనన్ శుబ్‌మన్ గిల్ నిరాశపరుస్తున్నాడు. వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో విఫలమైన గిల్.. ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్న రెండో వన్డేలో అదే తీరును కనబరిచాడు. భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
మొదటి ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులకు డాట్ బాల్స్ ఆడిన గిల్.. ఆ తర్వాతి బంతికే లుబుషేన్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా పడిన బంతిని అనవసర షాట్ ఆడి గిల్ తన వికెట్ కోల్పోయాడు.
కాగా ఔటైన వెంటనే గిల్ గట్టిగా అరుస్తూ మైదానాన్ని వీడాడు. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో కూాడా గిల్ దాదాపు ఇదే రీతిలో అవుటయ్యాడు. అయితే మొదటి మ్యాచ్ తప్పిదాల నుంచి గిల్ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. గట్టిగా అరుస్తే కాదు.. ఆటలో చూపించాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
— Main Dheet Hoon (@MainDheetHoon69) March 19, 2023
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు