Shubman Gill: సెంచరీ మిస్‌ అయినా దిగ్గజాల సరసన చోటు

Shubman Gill Joins Elite List After Unbeaten 98 Runs Vs WI 3rd ODI - Sakshi

టీమిండియా యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో తొలి సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఒక ఓవర్‌ ఎక్కువున్నా.. మ్యాచ్‌కు వర్షం అడ్డంకి లేకపోయినా గిల్‌ సెంచరీ మార్క్‌ను అందుకునేవాడు. సెంచరీ మిస్‌ అవ్వడంపై గిల్‌ మ్యాచ్‌ అనంతరం తెగ బాధపడ్డాడు.

''ఒక్క ఓవర్‌ అదనంగా ఉన్నా సెంచరీ సాధించేవాడినని.. కానీ 98 పరుగులు వద్దే నా ఇన్నింగ్స్‌ ముగించాలని దేవుడు రాసిపెట్టాడు.. అయినా పర్లేదు నా ఇన్నింగ్స్‌తో టీమిండియా మ్యాచ్‌ను గెలిచింది.. కచ్చితంగా ఈ ఇన్నింగ్స్‌ నా కెరీర్‌లో ది బెస్ట్‌ అనడంలో సందేహం లేదు'' అని చెప్పుకొచ్చాడు. అయితే గిల్‌ సెంచరీ మార్క్‌ను మిస్‌ అయినప్పటికి సచిన్‌, సెహ్వాగ్‌, సునీల్‌ గావస్కర్‌ లాంటి టీమిండియా దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. టీమిండియా తరపున వన్డేల్లో 90కి పైగా పరుగులతో నాటౌట్‌గా నిలిచిన జాబితాలో గిల్‌ చేరాడు. 

క్రిష్ణమచారి శ్రీకాంత్‌(93*)
సునీల్‌ గావస్కర్‌(92*)
సచిన్‌ టెండూల్కర్‌ (96*)
వీరేంద్ర సెహ్వాగ్‌ (99*)
శిఖర్‌ ధావన్‌ (97*)
శుబ్‌మన్‌ గిల్‌(98*) 

చదవండి: Shubman Gill: మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు తిట్టుకున్నాడు.. కట్‌చేస్తే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top