శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ | Shreyas Iyer Scores Much-Awaited First-Class Double Hundred In Ranji Trophy | Sakshi
Sakshi News home page

#Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ

Nov 7 2024 11:56 AM | Updated on Nov 7 2024 12:13 PM

Shreyas Iyer Scores Much-Awaited First-Class Double Hundred In Ranji Trophy

టీమిండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్, ముంబై స్టార్ ప్లేయ‌ర్‌ శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజ‌న్‌లో భాగంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్ వేదిక‌గా ఒడిశాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అయ్య‌ర్ అద్భుత‌మైన డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు.

ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అయ్య‌ర్ వ‌న్డే త‌ర‌హాలో ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. మైదానం న‌లుమూల‌ల బౌండ‌రీలు బాదుతూ త‌న స‌త్తా ఎంటో మ‌రోసారి శ్రేయ‌స్‌ చూపించాడు. ఈ  క్ర‌మంలో అయ్య‌ర్ కేవ‌లం 201 బంతుల్లో త‌న తొలి ఫ‌స్ట్‌క్లాస్ డ‌బుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవ‌రాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 228 బంతులు ఎదుర్కొన్న అయ్య‌ర్‌.. 24 ఫోర్లు, 9 సిక్స్‌ల‌తో 233 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయ్య‌ర్‌తో పాటు సుద్దేశ్ లాడ్(150 బ్యాటింగ్‌) సెంచ‌రీతో మెరిశాడు. వీరిద్ద‌రి విధ్వంసం ఫ‌లితంగా ముంబై త‌మ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశ‌గా దూసుకుపోతుంది. 117 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై 4 వికెట్ల న‌ష్టానికి 521 ప‌రుగులు చేసింది.
అయ్య‌ర్ రీ ఎంట్రీ ఇస్తాడా?
కాగా శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న‌ పేల‌వ ఫామ్ కార‌ణంగా భార‌త టెస్టు జ‌ట్టులో చోటు కోల్పోయాడు. అయ్య‌ర్ చివ‌ర‌గా ఇండియా త‌ర‌పున టెస్టుల్లో ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై ఆడాడు. తొలి టెస్టు ఆడిన అయ్య‌ర్‌కు త‌న వెన్ను గాయం తిరగ‌బెట్ట‌డంతో సిరీస్ మొత్తానికి దూర‌మ‌య్యాడు.

ఆ త‌ర్వాత రంజీల్లో ఆడాల‌న్న బీసీసీఐ అదేశాలు దిక్క‌రించ‌డంతో అయ్య‌ర్ త‌న సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత దిగివచ్చిన శ్రేయస్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆడేందుకు సిదద్దమయ్యాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు టోర్నీ, దులీప్‌ ట్రోఫీలో అతడు ఆడాడు. ఇప్పుడు రంజీ సీజన్‌లో కూడా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక అద్బుత డబుల్‌ సెంచరీతో అయ్యర్‌ తిరిగి భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది.
చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన పీవీ సింధు.. పునాది పడింది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement