అంచనాలు అందుకుంటాం! | Shreyas Iyer Comments About Winning Title Ahead IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: అంచనాలు అందుకుంటాం!

Mar 21 2026 9:21 PM | Updated on Mar 21 2026 9:21 PM

Shreyas Iyer Comments About Winning Title Ahead IPL 2026

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా పంజాబ్‌ కింగ్స్‌ బరిలోకి దిగుతోంది. పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ప్రధాన బలం. గతేడాది సీజన్‌లో కెప్టెన్‌ా అయ్యర్‌ పంజాబ్‌ను ఫైనల్‌ చేర్చాడు. కానీ తుది పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓడిపోయి రన్నరప్‌కే పరిమితమయింది. 

కానీ ఈసారి మాత్రం అభిమానులు తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఐపీఎల్‌ కప్పు కొల్లగొడతామని శ్రేయస్‌ అయ్యర్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 19వ సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అయ్యర్‌ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.‘గాయం వల్ల నేను దాదాపు ఏడు కేజీలు బరువు తగ్గాను. 

దాని నుంచి కోలుకొని రావడం పెద్ద సవాల్‌గా నిలిచింది. నాకైన గాయం చాలా ప్రమాదకరమైనది. అయితే రెండు నెలల తీవ్రంగా కష్టపడిన తర్వాత ఇప్పుడు శరీరాకృతి బాగుంది. కానీ ఫిట్‌గా ఉంటూనే ఏడు కేజీల బరువు పెరగాలంటే చాలా శ్రమించాలి. నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. తప్పకుండా పరిస్థితిని అధిగమిస్తా. ఇలాంటివి ఎన్నోసార్లు అనుభవించా. కమ్‌బ్యాక్‌ చేసి భారత జట్టుకు ఆడిన రోజులు ఉన్నాయి. గతేడాది మేం ఫైనల్‌కు వచ్చాం. 

రన్నరప్‌గా నిలిచాం.దీంతో ఈసారి మాపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడానికి కష్టపడతాం. విజయాలు సాధించి ట్రోఫీని అందుకుంటాం. ప్రతి మ్యాచ్‌కు మూడు రోజుల ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మైదానం ఆవల ఉండే బాండింగ్‌తోనే మ్యాచ్‌లో మెరుగ్గా రాణించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది’ అని శ్రేయస్‌ తెలిపాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 31న గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడనుంది.

చదవండి: అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement