IND vs BAN: చరిత్ర సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌.. తొలి భారత బ్యాటర్‌గా

Shreyas Iyer becomes fastest Indian cricketer to reach 1500 ODI runs - Sakshi

టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 1500 పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 82 పరుగులు సాధించిన అయ్యర్‌.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతకుముందు ఈ రికార్డు భారత స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ పేరిట ఉండేది. రాహుల్‌ 36 ఇన్నిం‍గ్స్‌లలో ఈ ఘనత సాధించగా.. అయ్యర్‌ 34 ఇన్నింగ్స్‌లలో నే ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అయ్యర్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 38 వన్డేలు ఆడిన అయ్యర్‌.. 1534 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలతో పాటు 14 అర్ధ శతకాలు ఉన్నాయి.

ధావన్‌ రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్‌..
ఇక ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ మరో రికార్డును కూడా సాధించాడు. 2022 ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అయ్యర్‌ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(685) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ధావన్‌ రికార్డును అయ్యర్‌ బ్రేక్‌ చేశాడు. ఈ ఏడాదిలో 14 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్‌ 721 పరుగులు సాధించాడు.
చదవండిIND vs BAN: వరుసగా రెండు సెంచరీలు.. రోహిత్‌ స్థానంలో జట్టులోకి! ఎవరీ ఈశ్వరన్?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top