షోయబ్‌ మాలిక్‌కు ఉద్వాసన | Shoaib Malik and Mohammad Amir left out New Zealand tour | Sakshi
Sakshi News home page

షోయబ్‌ మాలిక్‌కు ఉద్వాసన

Nov 12 2020 6:27 AM | Updated on Nov 12 2020 6:27 AM

Shoaib Malik and Mohammad Amir left out New Zealand tour - Sakshi

కరాచీ: న్యూజిలాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో పాకిస్తాన్‌ సీనియర్‌ ప్లేయర్‌ షోయబ్‌ మాలిక్‌తోపాటు పేసర్‌ మొహమ్మద్‌ అమీర్‌కు చోటు దక్కలేదు. కేవలం టి20 క్రికెట్‌ మాత్రమే ఆడుతోన్న 38 ఏళ్ల మాలిక్‌ను తాజాగా ముగిసిన జింబాబ్వే సిరీస్‌కు కూడా పక్కనబెట్టారు. తాజా పరిణామంతో అతను వచ్చే ఏడాది భారత్‌లో జరుగనున్న టి20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేది అనుమానంగా మారింది. పాక్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య డిసెంబర్‌ 18, 20, 22 తేదీల్లో 3 టి20 మ్యాచ్‌లు... మౌంట్‌ మాంగనీ (డిసెంబర్‌ 26–30), క్రైస్ట్‌చర్చ్‌ (జనవరి 3–7) వేదికల్లో రెండు టెస్టులు జరుగుతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement