Shivam Dube Married Girlfriend Anjum Khan Shares Pics - Sakshi
Sakshi News home page

Shivam Dube: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ క్రికెటర్‌

Jul 17 2021 7:31 AM | Updated on Jul 17 2021 11:02 AM

Shivam Dube Married Girlfriend Anjum Khan Shares Pics - Sakshi

క్రికెటర్‌ శివం దూబే తన ప్రేయసి అంజుమ్‌ ఖాన్‌ను పెళ్లాడాడు

న్యూఢిల్లీ: టీమిండియా బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు అంజుమ్‌ ఖాన్‌ను పెళ్లాడి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శివం దూబే ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ‘‘ప్రేమ కంటే కూడా అమితమైన బంధం... చిరకాల ప్రయాణానికి ఇది ఆరంభం.. జస్ట్‌ మ్యారీడ్‌’’ అంటూ శుక్రవారం తమ పెళ్లి జరిగినట్లు వెల్లడించాడు. ఇందుకు స్పందనగా అంజుమ్‌ హర్ట్‌ ఎమోజీలతో భర్తపై ప్రేమను కురిపించింది. 

ఆమె సైతం తమ వివాహ వేడుకలోని మధుర ఘట్టాలకు సంబంధించిన దృశ్యాలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఈ క్రమంలో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా శివం దూబే టీమిండియా తరఫున 2019లో టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అదే ఏడాది వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌తో వన్డేల్లో అడుగుపెట్టాడు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు శివం దూబే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పెళ్లి సందర్భంగా శివం- అంజుమ్‌లకు రాజస్తాన్‌ ఫ్రాంఛైజీ శుభాకాంక్షలు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement