IND vs BAN: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌కు ఏమైంది? స్టేడియంలోకి అంబులెన్స్‌! ఆసుపత్రికి తరలింపు

Shakib Al Hasan sent to hospital due to stiffness: Reports - Sakshi

టీమిండియాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్‌.. ఇప్పుడు టెస్టు సిరీస్‌పై కన్నేసింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఛాటోగ్రామ్‌ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హాసన్‌ గాయపడ్డాడు.

ప్రాక్టీస్‌ చేస్తుండగా షకీబ్‌ తొడ కండరాలు పట్టేసినట్లు తెలుస్తోంది. కాగా స్టేడియం దగ్గరలో ఇతర వాహనాలు ఏవీ అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్‌లో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కాదని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. దీంతో బంగ్లా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

"షకీబ్‌ గాయం అంత తీవ్రమైనది కాదు. ఇతర ఇతర రవాణా సౌకర్యాలు అందుబాటులో లేనందున అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపాల్సి వచ్చింది. అతడికి కండరాలు పట్టేశాయి. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. షకీబ్‌ తిరిగి ఆఖరి ప్రాక్టీస్‌ సెషన్‌కు జట్టుతో చేరుతాడు" అని బీసీబీ అధికారి పేర్కొన్నారు. కాగా టీమిండియాతో వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్‌ సొంతం చేసుకోవడంలో షకీబ్‌ కీలక పాత్ర పోషించాడు.

తొలి టెస్ట్‌కు బంగ్లాదేశ్‌ జట్టు: షకీబుల్‌ హసన్‌ (కెప్టెన్‌), మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌, నజ్ముల్‌ హసన్‌ షాంటో, మోమినుల్‌ హక్‌, యాసిర్‌ అలీ చౌదరీ, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, నురుల్‌ హసన్‌, మెహదీ హసన్‌ మిరాజ్‌, తైజుల్‌ ఇస్లామ్, తస్కిన్‌ అహ్మద్‌, సయ్యద్‌ ఖాలెద్‌ అహ్మద్‌, ఇబాదత్‌ హుస్సేన్‌, షోరిఫుల్‌ ఇస్లామ్‌, జాకిర్‌ హసన్‌, రెజావుర్‌ రెహమాన్‌, అనాముల్‌ హక్‌ బిజోయ్‌
చదవండి: ENG vs PAK: పాపం బాబర్‌ ఆజం.. ఇంగ్లండ్‌ బౌలర్‌ దెబ్బకు మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top