ఒకే రీతిలో ఇద్దరు గోల్డెన్‌ డక్‌.. అఫ్రిది కొత్త చరిత్ర

Shaheen Shah Afridi  Creates Record After Two Batsmen Become Golden Duck - Sakshi

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సిరీస్‌ రద్దు చేసుకోవడంతో  పాకిస్తాన్‌ టి20 ప్రపంచకప్‌ సన్నాహాలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్‌ క్రికెటర్లు నేషనల్‌ టి20 కప్‌ ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. సిక్స్‌ టీమ్‌ డమొస్టిక్‌ టి20 కాంపిటీషన్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌ల్లో కొందరు పాక్‌ ఆటగాళ్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నారు. వారిలో పాకిస్తాన్‌ యువపేసర్‌ షాహిన్‌ షా అఫ్రిది ఒకడు. లీగ్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా తరపున ఆడుతున్న అఫ్రిది  అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు. స్థిరంగా వికెట్లు తీస్తున్న అఫ్రిది మ్యాచ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

చదవండి: IPL 2201: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆ ప్లేయర్‌కు ఏం కాలేదు

వరుసగా నాలుగు విజయాలు సాధించిన ఖైబర్‌ పఖ్తుంఖ్వా తాజాగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నార్తన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది ఓకే ఓవర్‌లో వరుస బంతుల్లో ఇద్దరిని గోల్డెన్‌ డక్‌గా వెనక్కి పంపాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో రెండో బంతికి అలీ ఇమ్రాన్‌ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. ఆ తర్వాత మరుసటి బంతికే హైదర్‌ అలీని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కాగా అతను వేసిన రెండు డెలివరీలు అచ్చం ఒకేలా ఉండడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ లీగ్‌లో షాహిన్‌ 6 మ్యాచ్‌లాడి 12 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో అక్టోబర్‌ 24న పాకిస్తాన్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: T20 World Cup 2021: హార్దిక్‌ పాండ్యాపై విశ్వాసం ఎక్కువ.. అతన్ని తొలగించరు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top