‘టాప్‌’ ర్యాంక్‌లో షాహిన్‌ అఫ్రిది | Shaheen Afridi is in the top rank | Sakshi
Sakshi News home page

‘టాప్‌’ ర్యాంక్‌లో షాహిన్‌ అఫ్రిది

Nov 2 2023 2:31 AM | Updated on Nov 2 2023 2:31 AM

Shaheen Afridi is in the top rank - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ పేస్‌ బౌలర్‌ షాహిన్‌ షా అఫ్రిది తొలిసారి టాప్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో షాహిన్‌ అఫ్రిది 673 పాయింట్లతో ఏడు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచాడు. హాజల్‌వుడ్‌ (ఆస్ట్రేలియా) టాప్‌ నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్‌ యాదవ్‌ వరుసగా మూడు, ఏడు స్థానాల్లో ఉన్నారు.

ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో షాహిన్‌ 16 వికెట్లు పడగొట్టి ఆడమ్‌ జంపా (ఆ్రస్టేలియా), మార్కో జాన్సెన్‌ (దక్షిణాఫ్రికా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌ ప్రవేశపెట్టాక వన్డే ఫార్మాట్‌లో ఏకకాలంలో బౌలింగ్, బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ క్రికెటర్లు నంబర్‌వన్‌ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. 

Advertisement
 
Advertisement
Advertisement