కేకేఆర్‌ అవుట్‌..భారత్‌కు చేరుకున్న షారుక్‌

Shah Rukh Khan And  Family  Return  From  The UAE  - Sakshi

దుబాయ్‌:  కేకేఆర్‌ జట్టు సహ యజమాని.. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ భారత్‌కు చేరుకున్నారు. ఇటీవల ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలుపొందడంతో టోర్నీ నుంచి  కేకేఆర్‌ నిష్ర్కమించింది. ఈ నేపథ్యంలో ఆయన ఇండియాకు తిరిగొచ్చారు. ఈ మేరకు శనివారం ముంబైలోని కలీనా ఎయిపోర్ట్ వద్ద కనిపించాడు. షారుక్‌ వెంట ఆయన భార్య గౌరీ ఖాన్‌, కుమారులు ఆర్యన్‌, అబ్రామ్‌ ఉన్నారు. అయితే కూతురు సుహానా ఖాన్‌ మాత్రం కనిపించలేదు. 

దుబాయ్‌లోనే షారుక్‌  బర్త్‌డే సెలబ్రేషన్స్‌
షారుక్ ఇటీవలె దుబాయ్‌లో తన 55వ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్‌ చేసుకున్నారు.  షారుక్‌ కుటుంబసభ్యులు సహా ఆయన స్నేహితులు కరణ్‌ జోహార్‌, మనీష్ మల్హోత్రా బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో ప్రదర్శించిన ఫారుఖ్‌ విజువల్స్‌ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాల విషయానికి వస్తే షారుక్  చివరిసారిగా కత్రినా కైఫ్‌, అనుష్క శర్మతో కలిసి జీరో అనే చిత్రంలో కనిపించాడు. (కమిన్స్‌కు షారుక్ ఖాన్‌‌ వార్నింగ్‌ )

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top