breaking news
Return To India
-
అమెరికా వెళ్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
ఏపీ విద్యార్థులతో సహా కొంతమంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ అక్కడి నుంచి తిప్పి పంపిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత కొద్ది రోజులుగా ఏపీ విద్యార్థులతో సహా, భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ తిరిగి ఇండియాకు పంపించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించారు. విద్యార్థులంతా వారి ఉన్నత చదువుల కోసం వ్యాలిడ్ వీసాను కలిగి ఉన్నారని, వారి కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని సీఎం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరనున్నారు. పూర్తి అవగాహన అవసరం.. అమెరికా వీసా ఉన్నంత మాత్రాన ఆ దేశంలోకి ప్రవేశమనేది గ్యారెంటీ కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. అమెరికా వెళ్లే విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ (పోర్ట్ ఆఫ్ ఎంట్రీ) వద్ద కస్టమ్స్, బోర్డర్ ప్రొటక్షన్ (సీబీపీ) అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి. తమ ప్రవేశం ఎందుకనే అంశాన్ని చెప్పి వారిని ఒప్పించగలగాలి. ఈ క్రమంలో అధికారులు అడిగే ఆర్థికపరమైన రుజువులు, ఇతర ధ్రువీకరణ పత్రాలు, అమెరికా ఇమ్మిగ్రేషన్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై అవగాహన, తాము చదవబోతున్న యూనివర్సిటీ, కోర్సులు, తదితర అంశాలపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వండి. పేరున్న ఏజెన్సీలైతే మంచిది.. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ను సంప్రదించగలరని ఆ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. ఇది ఎన్నారై సేవలతోపాటు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు విదేశీ విద్యకు సంబంధించి అడ్మిషన్, కౌన్సెలింగ్ ప్రక్రియ, అమెరికా (ఇతర దేశాలు) వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అక్కడకు వెళ్లాక పాటించాల్సిన పద్ధతులు, లాంగ్‌టర్మ్ ట్రాకింగ్ తదితర అంశాలపై సేవలు అందిస్తోంది. కొన్ని విదేశీ విద్య కన్సల్టెంట్లు, సంస్థలు, ఏజెన్సీలు విద్యార్థులకు తప్పుడు హామీలిచ్చి మోసం చేసే అవకాశం ఉంది. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలి. మంచి పేరున్న ఏజెన్సీల ద్వారానే విద్యార్థులు అమెరికా వెళ్లడం మంచిది. అధికారులకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాలి.. అమెరికా చట్టాల ప్రకారం.. ఆ దేశానికి వచ్చేవారంతా యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారుల తనిఖీకి లోబడి ఉంటారు. ఈ క్రమంలో విద్యార్థి దశలో అమెరికాలో జీవించడానికి అవసరమైన ఆర్థిక స్థోమతకు రుజువులు, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, తదితరాల గురించి మన విద్యార్థులను అడిగినప్పుడు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు అడిగినవాటికి సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వకపోతే విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉందని అధికారులు భావించొచ్చు. సహాయం కోసం సంప్రదించండి.. విద్యార్థులు ఏదైనా సహాయం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ నంబర్లు +91 8632340678, 8500027678 కు 24/7 ఫోన్ చేయొచ్చు లేదా info@apnrts.com లేదా helpline@apnrts.com కు మెయిల్ చేయొచ్చు. -
క్వీన్ ఎలిజబెత్–2 మృతి.. కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి.. హక్కుదారు ఎవరు?
న్యూఢిల్లీ: క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 105 క్యారెట్ల అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోహినూర్‌ను ఇకనైనా స్వదేశానికి అప్పగించాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కోహినూర్ అంటే వెలుగుల కొండ అని అర్థం. 14 శతాబ్దం ఆరంభంలో దక్షిణ భారతదేశంలో తవ్వకాల్లో లభించినట్లు చరిత్రలో నమోదయ్యింది. తర్వాత పలువురు రాజులు, చక్రవర్తుల చేతులు మారుతూ వచ్చింది. చివరకు బ్రిటిష్ రాణి కిరీటంలోకి చేరింది. కోహినూర్ తమదేనంటూ భారత్, పాకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్ దేశాలు వాదిస్తున్నాయి. వజ్రానికి అసలు హక్కుదారులు ఎవరన్నదానిపై శతాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు బ్రిటన్ రాణి మృతిచెందారంటూ కాబట్టి కోహినూర్‌ను భారత్‌కు అప్పగించాలని ట్విట్టర్లో జనం డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ సింహాసనాన్ని అధిష్టించబోతున్నారు. కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని రాణి హోదాలో ఆయన భార్య కెమిల్లా పార్కర్ ధరిస్తారు. కోహినూర్ వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. -
భారతీయ విద్యార్థులూ.. భయం వద్దు
కీవ్: రెండు రోజులైంది. తినడానికి తిండి లేదు, నిద్ర లేదు. తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదు. ప్రాణభయంతో బేస్మెంట్లలో తలదాచుకోవాల్సిన దుస్థితి. బాంబులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. రష్యా సేనలు పౌర నివాస ప్రాంతాలపైన కూడా బాంబుల వర్షం కురిపిస్తూ ఉండడంతో ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలర చేతుల్లో పెట్టుకొని ఉన్నారు. దేశం కాని దేశంలో యుద్ధ భయంతో భీతిల్లుతున్న తమ కన్న బిడ్డలకి ఎలాంటి ముప్పు వస్తుందో తెలీక భారత్‌లో ఉన్న తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. రెండు రోజులుగా తిండి, నిద్ర లేకుండా గడుపుతున్న విద్యార్థుల్ని క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు ప్రత్యేక విమానాల్ని రుమేనియా రాజధాని బుకారెస్ట్‌కు పంపించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బుకారెస్ట్కి చేరుకోగలిగే విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా విదేశాంగ శాఖ అ«ధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికయ్యే ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల్ని బుకారెస్ట్ తీసుకురావడానికి కీవ్‌లో భారత రాయబార కార్యాలయం వారికి సహకారం అందిస్తుంది. రుమేనియా, హంగేరి నుంచి వారిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది. రుమేనియా, హంగేరి సరిహద్దు ప్రాంతాలైన చాప్ జహోని, చెర్నివిట్సికి సమీపంలో సిరెత్ సరిహద్దుల్లో నివసించే భారతీయులు ఒక క్రమ పద్ధతిలో చెక్ పాయింట్ల దగ్గరకు చేరుకోవాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారతీయులందరూ ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. పాస్‌పోర్టు, కోవిడ్–19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్తో పాటు అత్యంత అవసరమైన సామాన్లు మాత్రమే వెంట తీసుకురావాలని సూచించింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం 16 వేల మంది భారతీయులు చిక్కుకొని ఉంటే వారిలో అత్యధికులు విద్యార్థులే. 8 కి.మీ. నడుచుకుంటూ 40 మంది భారతీయ వైద్య విద్యార్థులు నడుచుకుంటూ పోలండ్ సరిహద్దులకు చేరుకున్నారు. లివివ్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న వారంతా 8కి.మీ.కు పైగా నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వచ్చారు. ఉక్రెయిన్ ఇరుగు పొరుగు దేశాల నుంచి విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో వీరంతా ప్రాణాలు దక్కించుకోవడానికి నడుచుకుంటూ వచ్చారు. -
ఎంపీ ప్రత్యేక చొరవ.. సౌదీలో చిక్కుకున్న బాధితులకు విముక్తి
సాక్షి, వైస్సార్ కడప: సౌదీలో యజమాని చెరలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైఎస్సార్ కడప వాసులకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విముక్తి కల్పించారు. కడపకు చెందిన గొరెంట్ల రమణయ్య, సతీష్ చౌదరి ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీవెళ్లారు. ఆ తర్వాత సౌదీ యజమాని వారి నుంచి పాస్‌పోర్టులు లాక్కొని సరైన ఆహరం పెట్టకుండా పొలం పనులు చేయిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ మేరకు బాధితుల కుటుంబ సభ్యులు తమవారి బాధను ఎంపీ మిథున్‌రెడ్డికి తెలియజేశారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్లారు. విదేశాంగశాఖ అధికారులు బాధితులకు రావాల్సిన జీతం డబ్బులు ఇప్పించి, త్వరలోనే తిరిగి వారి స్వస్థలాలకు చేరేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎంపీ మిథున్‌రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి -
తొలి టెస్టు తర్వాత స్వదేశానికి కోహ్లి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి రానున్నాడు. తొలి టెస్టు ఆడాక భారత్‌కు పయనమవుతాడు. అయితే అన్ని ఫార్మాట్లకు ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చిన సెలక్షన్ కమిటీ కెప్టెన్ గైర్హాజరీ నేపథ్యంలో టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికైన ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి గాయంతో ఆసీస్ పర్యటనకు దూరమయ్యాడు. కేవలం టి20లకే ఎంపికైన సంజూ సామ్సన్ను ఇప్పుడు వన్డే జట్టులోనూ ఆడతాడు. నేడు జరిగే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన మరుసటి రోజే టీమిండియా యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. భార్య ప్రసవం ఉండటంతో... టీమిండియా సారథి విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి. ఆమె డెలివరీ తేదీ జనవరిలో ఉంది. దీంతో అనుష్క ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని కోహ్లి భావించాడు. ఈ మేరకు తన మనసులోని మాటను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రముఖులకు తెలిపాడు. కోహ్లి అభ్యర్థనను బీసీసీఐ అంగీకరించింది. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కోహ్లికి అనుమతి మంజూరు చేసింది. రెండు నెలలపాటు సుదీర్ఘంగా సాగే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తొలుత మూడు వన్డే మ్యాచ్‌లు (నవంబర్ 27, 29, డిసెంబర్ 2) ఆడుతుంది. అనంతరం మూడు టి20 మ్యాచ్‌ల్లో (డిసెంబర్ 4, 6, 8) బరిలోకి దిగుతుంది. అనంతరం నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్ 17 నుంచి 21 వరకు డే–నైట్‌గా జరుగుతుంది. ఈ మ్యాచ్ ముగిశాకే కోహ్లి భారత్‌కు తిరిగి వస్తాడు. మెల్బోర్న్లో జరిగే రెండో టెస్టు (26 నుంచి 30) సహా సిడ్నీ (జనవరి 7 నుంచి 11), బ్రిస్బేన్ (15 నుంచి 19)లలో జరిగే మూడో, నాలుగో టెస్టులకు కోహ్లి దూరమవుతాడు. ఆసీస్‌కు ‘హిట్‌మ్యాన్’... ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ టెస్టులాడేందుకు ఈ నెలాఖర్లో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరతాడు. రోహిత్ చేరిక, ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘బీసీసీఐ వైద్య బృందం అతని ఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇదే విషయాన్ని మేం సెలక్షన్ కమిటీకి తెలియజేశాం. పూర్తి ఫిట్నెస్ సంతరించుకునేందుకే అతనికి పరిమిత ఓవర్ల సిరీస్‌కు విశ్రాంతినిచ్చాం. ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేశాం’ అని తెలిపారు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోని పునరావాస శిబిరంలో ఉన్న ఇషాంత్ శర్మతో కలిసి రోహిత్ అక్కడికి పయనమవుతాడు. గాయం దాచిన వరుణ్... ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. అతన్ని టి20ల కోసం ఎంపిక చేయగా... భుజం గాయంతో అక్కడికి వెళ్లడం లేదు. ఐపీఎల్ సందర్భంగా గాయమైన సంగతిని వరుణ్ దాచి పెట్టాడని బీసీసీఐ గుర్రుగా ఉంది. అతని భుజానికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కాగా అతని స్థానంలో ‘యార్కర్ స్పెషలిస్ట్’, తమిళనాడు ఎడంచేతి వాటం పేస్ బౌలర్ నటరాజన్‌ను ఎంపిక చేశారు. తొడ కండరాల గాయంతో ఉన్న వృద్ధిమాన్ సాహాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. నెట్‌బౌలర్‌గా కమలేశ్ నాగర్కోటి అక్కడికి వెళ్లడం లేదు. అతన్ని ఎన్సీఏకు పంపుతున్నారు. -
కేకేఆర్ అవుట్..భారత్‌కు చేరుకున్న షారుక్
దుబాయ్: కేకేఆర్ జట్టు సహ యజమాని.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ భారత్‌కు చేరుకున్నారు. ఇటీవల ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలుపొందడంతో టోర్నీ నుంచి కేకేఆర్ నిష్ర్కమించింది. ఈ నేపథ్యంలో ఆయన ఇండియాకు తిరిగొచ్చారు. ఈ మేరకు శనివారం ముంబైలోని కలీనా ఎయిపోర్ట్ వద్ద కనిపించాడు. షారుక్ వెంట ఆయన భార్య గౌరీ ఖాన్, కుమారులు ఆర్యన్, అబ్రామ్ ఉన్నారు. అయితే కూతురు సుహానా ఖాన్ మాత్రం కనిపించలేదు. దుబాయ్‌లోనే షారుక్ బర్త్‌డే సెలబ్రేషన్స్ షారుక్ ఇటీవలె దుబాయ్‌లో తన 55వ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. షారుక్ కుటుంబసభ్యులు సహా ఆయన స్నేహితులు కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో ప్రదర్శించిన ఫారుఖ్ విజువల్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాల విషయానికి వస్తే షారుక్ చివరిసారిగా కత్రినా కైఫ్, అనుష్క శర్మతో కలిసి జీరో అనే చిత్రంలో కనిపించాడు. (కమిన్స్‌కు షారుక్ ఖాన్ వార్నింగ్ ) View this post on Instagram Happy birthday @iamsrk !! Love you !! May the lights shine on forever .... ❤️❤️❤️ A post shared by Karan Johar (@karanjohar) on Nov 2, 2020 at 11:32am PST -
కోవిడ్ కేసులు 107
న్యూఢిల్లీ: కోవిడ్ (కరోనా వైరస్) భారత్‌లో స్థానికంగానే వ్యాపిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 107కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 12 కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కేసుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి నుంచి అన్ని దేశాల సరిహద్దుల్ని మూసివేసిన కేంద్రం తాజాగా కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా మార్గం వెంబడి కూడా రాకపోకలపై నిషేధం విధించింది. ఆ మార్గం ద్వారా సిక్కు భక్తులు పాక్‌కు వెళ్లడానికి తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కరోనా నేపథ్యంలో ఢిల్లీ–జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ బోగీని శుభ్రం చేస్తున్న కార్మికుడు స్థానికంగా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కరోనా వ్యాప్తి మన దేశంలో స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే దశలోనే ఉంది. దీనిని రెండో దశ అంటారు. ఇక మూడో దశలో జన సమూహాలకు సోకి వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఆ దశ రాకుండానే కేంద్రం, అన్ని రాష్ట్రాలు కరోనాపై యుద్ధం ప్రకటించాయి. పకడ్బందీ చర్యలు చేపట్టడంతో హెల్ట్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఇంకా రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జన సందోహాలు గుమికూడకుండా పర్యవేక్షణ, కోవిడ్–19 సోకిందని అనుమానాలున్న వారిని విడిగా ఉంచడం, వైరస్ నుంచి వ్యక్తిగత రక్షణ కోసం మాస్క్‌లు, శానిటైజర్ల వంటివి అందుబాటులో ఉంచడం , సుశిక్షితులైన మానవ వనరులు, చురుగ్గా స్పందించే బృందాలను బలోపేతం చేయడం వంటివి చేస్తున్నామని అన్నారు. 80,50,000 ఎన్95 మాస్కుల కోసం ఆర్డర్ ఇచ్చామని, హెల్త్‌కేర్ వర్కర్స్‌కి అందిస్తామని తెలిపారు. మహారాష్ట్రలో మరణించిన వ్యక్తికి కరోనా లేదు మహారాష్ట్రలో బుల్దానాలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన 71 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకలేదని నిర్ధారణ అయినట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఆయన మరణించడానికి ముందు సేకరించిన నమూనాలను పరీక్షించి చూస్తే కరోనా సోకలేదని తేలింది. తొలుత ఆ వృద్ధుడు కరోనాతో మరణించాడన్న అనుమానాలు తలెత్తాయి. ఇరాన్, ఇటలీ నుంచి భారతీయులు వెనక్కి ఇరాన్ నుంచి మూడో విడత 236 మంది భారతీయుల్ని వెనక్కి తీసుకువచ్చారు. వారందరినీ జైసల్మీర్‌లో ఆర్మీ ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. చైనా తర్వాత అత్యధికంగా కరోనా దాడి చేసిన ఇటలీ నుంచి 218 మంది భారతీయుల్ని ఆదివారం వెనక్కి తెచ్చారు. వారిలో 211 మంది విద్యార్థులే ఉన్నారు. వీరిని వాయవ్య ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన 20 మంది ప్రయాణికుల్లో బ్రిటన్‌కు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో అతడిని కొచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో స్వదేశీ, విదేశీ టూర్లపై కూడా ముంబై సీపీ నిషేధం విధించారు. తాజాగా తమిళనాడు, అస్సాం, ఉత్తరాఖండ్‌లో పాఠశాలలు, షాపింగ్ మాల్స్ రెండు వారాల పాటు బంద్ చేశారు. -
311 మంది భారతీయులను వెనక్కి పంపిన మెక్సికో
మెక్సికో సిటీ: సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో ఉంటున్న 311 మంది భారతీయులను మెక్సికో అధికారులు వెనక్కి పంపించారు. ఈ మేరకు తమ దేశంలో ఉండేందుకు సరైన అనుమతులు లేని భారతీయులను టొలుకా విమానాశ్రయం నుంచి ప్రత్యేక బోయింగ్ 747 విమానంలో భారత్‌కు తిప్పి పంపినట్లు మెక్సికన్ జాతీయ వలసల సంస్థ (ఐఎన్ఎమ్) ఓ ప్రకటనలో పేర్కొంది. మెక్సికన్ సరిహద్దుల నుంచి పెరుగుతున్న వలసలను నివారించేందుకు ఆ దేశంపై టారిఫ్‌ల భారం పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో మెక్సికో ఈ చర్యకు పూనుకుంది. సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతోపాటు వలసదారులను దేశంలోకి అనుమతించే పాలసీని సవరించాలని నిర్ణయించింది. అక్రమ వలసదారులను తిప్పి పంపించే విషయంలో భారతీయ దౌత్య కార్యాలయం మంచి సహకారం అందించిందని, కృతజ్ఞతలు తెలిపింది. -
రానా రిటర్న్స్
కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నారు రానా. ఆరోగ్య సమస్యల రీత్యా అనేది వార్త. గుణశేఖర్ దర్శకత్వంలో చేయబోతున్న ‘హిరణ్య కశ్యప’ సినిమా ప్రీ విజువలైజేషన్‌కు సంబంధించిన పని అనేది ఒక వార్త. ఈ రెండింట్లో ఏ విషయమై రానా అమెరికాలో ఉన్నారో క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే ‘అమెరికా ట్రిప్ ముగిసింది, ఇండియా వచ్చేస్తున్నాను’ అని అప్డేట్ ఇచ్చారు రానా. -
ప్రపంచకప్ విజేతలకు ఘన స్వాగతం
సాక్షి, ముంబై : న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో అదరగొట్టి ట్రోఫీని సొంత చేసుకున్న భారత కుర్రాళ్లు సోమవారం స్వదేశానికి చేరారు. వీరికి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పృథ్వీషా నేతృత్వంలోని యువ జట్టు భారత్‌కు నాలుగోటైటిల్ అందించిన విషయం తెలిసిందే. యువ క్రికెటర్లకు స్వాగతం పలికేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ముంబై అంతర్జాతీయ విమానం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. సమిష్టి కృషి వల్లే ప్రపంచకప్ సాధించామన్నారు. అందరూ బాగా రాణించడంతో మా కష్టానికి ఫలితం దక్కిందని, యువ క్రికెటర్లకు మంచి భవిష్యత్ ఉందని కితాబిచ్చారు. -
రేపు రానున్న తెలుగు ప్రొఫెసర్లు
న్యూఢిల్లీ: గతేడాది లిబియాలో ఉగ్రవాదులు చేతుల్లో కిడ్నాప్ కు గురై వారి చెర నుంచి బంధీలుగా విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం వారు తమ స్వగ్రామానికి చేరుకుంటారని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఓ ప్రకటనలో తెలిపారు. 2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ లిబియాలోని సిర్టే యూనివర్శిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్ సమీపంలో వారు కిడ్నాప్ కు గురయ్యారు. వారిలోని కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను రెండురోజుల్లోనే వదిలేసిన ఉగ్రవాదులు.. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరామ కిషన్, శ్రీకాకుళం టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణలను మాత్రం చెరలోనే ఉంచారు. వారి విడుదలకోసం లిబియా దేశ రాయబారితో అప్పట్నుంచీ కేంద్రం చర్చలు జరుపుతూనే ఉంది. వారి విడుదలలో కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కీలకంగా వ్యవహరించారు.