భారత మహిళల క్రికెట్‌ జట్టులో షబ్నమ్‌ | Shabnam in the Indian womens cricket team | Sakshi
Sakshi News home page

భారత మహిళల క్రికెట్‌ జట్టులో షబ్నమ్‌

Jun 21 2024 4:06 AM | Updated on Jun 21 2024 2:07 PM

Shabnam in the Indian womens cricket team

విశాఖ స్పోర్ట్స్‌: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న క్రికెట్‌ సిరీస్‌లో పాల్గొంటున్న భారత జట్టులో అదనంగా మరో ప్లేయర్‌ను చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మీడియం పేస్‌ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్‌ను తొలిసారి భారత సీనియర్‌ జట్టులోకి ఎంపిక చేశారు. మూడు ఫార్మాట్‌లలోని (వన్డే, టెస్టు, టి20) టీమిండియాలో షబ్నమ్‌కు చోటు దక్కడం విశేషం.

విశాఖపట్నంకు చెందిన షబ్నమ్‌ గత ఏడాది జనవరిలో జరిగిన అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. ఈ ఏడాది మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడిన షబ్నమ్‌ నాలుగు వికెట్లు పడగొట్టింది. 

ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న సిరీస్‌లో బెంగళూరు వేదికగా జరిగిన తొలి రెండు వన్డేల్లో భారత జట్టు గెలిచింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం బెంగళూరులోనే జరుగుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement