ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో కేసు ముగిస్తున్నాం: సుప్రీంకోర్టు

SC to hear wrestlers plea for harassment case against WFI chief - Sakshi

న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్‌ నెరవేరడంతో కేసును ముగిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆయనను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఎదురుదెబ్బ కాదని, బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని బజరంగ్, వినేశ్, సాక్షి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించిందని దీనిని కూడా పరిశీలిస్తామని వినేశ్‌ తెలిపింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top