రాణించిన బంగ్లా బౌలర్లు.. నామమాత్రపు స్కోరుకే పరిమితమైన శ్రీలంక | Asia Cup Super 4, SL Vs BAN: Sadeera Samarawickrama Helps Sri Lanka Post 257/9 Against Bangladesh - Sakshi
Sakshi News home page

Asia cup 2023: రాణించిన బంగ్లా బౌలర్లు.. నామమాత్రపు స్కోరుకే పరిమితమైన శ్రీలంక

Sep 9 2023 7:03 PM | Updated on Sep 9 2023 7:55 PM

Sadeera Samarawickramas Knock Helps Sri Lanka Post 257  - Sakshi

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా శ్రీలంకతో జరగుతున్న కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో శ్రీలంకను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.

శ్రీలంక బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సదీర సమరవిక్రమ 93 పరుగలతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు కుశాల్‌ మెండిస్‌(50), నిస్సంకా(40) పరుగులతో రాణించారు. ఇక బంగ్లాదేశ్‌ బౌలర్లలో టాస్కిన్‌ అహ్మద్‌, హసన్‌ మహ్మద్‌ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. షోర్‌ ఫుల్‌ ఇస్లాం రెండు వికెట్లు సాధించారు.


చదవండి: Asia Cup 2023: 'అతడొక యార్కర్ల కింగ్‌.. వరల్డ్‌ కప్‌ జట్టులో అతడు ఉండాల్సింది'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement