
ఆసియాకప్ 2025 గ్రూపు-బిలో అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు రాణించారు. బంగ్లాదేశ్ జట్టు విధించిన 140 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక సునాయాసంగా ఛేదించింది. శ్రీలంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సంక 50(34) పరుగులు చేశాడు. కమిల్ మిషారా 46(32) పరుగులు చేశాడు. మొత్తంగా శ్రీలంక జట్టు నాలుగు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. కాగా శ్రీలంక 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ రెండు వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్ రెహమాన్, టాంజిమ్ హాసన్ సాకిబ్ చెరో వికెట్ తీశారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. లంక బౌలర్ల ధాటికి విల్లవిల్లాడింది. ఆరంభంలోనే బంగ్లాదేశ్‌కు పేసర్లు నువాన్ తుషారా, దుష్మాంత చమీరలు భారీ షాకిచ్చారు. బంగ్లాదేశ్ మొదటి రెండు ఓవర్లలోనే ఎటువంటి పరుగు చేయకుండా రెండు వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేయగల్గింది.