
ఆసియాకప్ 2025 గ్రూపు-బిలో అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. లంక బౌలర్ల ధాటికి విల్లవిల్లాడింది. ఆరంభంలోనే బంగ్లాదేశ్‌కు పేసర్లు నువాన్ తుషారా, దుష్మాంత చమీరలు భారీ షాకిచ్చారు.
బంగ్లాదేశ్ మొదటి రెండు ఓవర్లలోనే ఎటువంటి పరుగు చేయకుండా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ లిట్టన్ దాస్ (28) కాసేపు ధాటిగా ఆడాడు. అతడు ఔటయ్యాక మళ్లీ బంగ్లా స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఈ క్రమంలో షమీమ్ హుస్సేన్(40), జాకర్ అలీ(33) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
వీరిద్దరూ ఆరో వికెట్‌కు 86 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేయగల్గింది. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. చమీరా, తుషారా తలా వికెట్ సాధించారు.