అందుకు కారణం లాక్‌డౌన్‌ కాదు: సచిన్‌

Sachin Tendulkar Posts Childhood Picture On Instagram - Sakshi

ఇలా పోజ్‌ ఇస్తానని నాకైతే తెలియదు

ముంబై: సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే మాస్టర్‌ బ్లాస్టర్‌, క్రికెట్‌ దేవుడిగా పిలుచుకునే సచిన్‌ టెండూల్కర్‌కు ఇప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. క్రికెట్‌లో తనకంటూ ఒక శకం సృష్టించుకున్న సచిన్‌ విశేషమైన అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. భారత్‌లో క్రికెట్‌ హీట్‌ను మరొకస్థాయికి తీసుకెళ్లడంలో సచిన్‌ది కీలక పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా సచిన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక ఫోటో వైరల్‌ అవుతోంది.

తన బాల్యంలోని ఫోటోల్లో ఒకదాన్ని సచిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు.  పాలబుగ్గల సచిన్‌.. పొడవాటి జట్టుతో ఉన్న ఫోటోను ఒకటి షేర్‌ చేశాడు. ఈ ఫోటోకు సచిన్‌ ఒక అందమైన క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. ‘ఇలా నేను పొడవాటి జట్టుతో ఉండటానికి లాక్‌డౌన్‌ కారణం కాదు. ఆ సమయంలో నేను ఇందుకు ఫోజు ఇచ్చానో నాకైతే తెలీదు’ అని రాసుకొచ్చాడు.ఈ ఫోటో పోస్ట్‌ చేసిన రోజున్నర వ్యవధిలోనే తొమ్మిదిలక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. దాంతో పాటు పలువురు ఈ ఫోటోపై స్పందిచారు. ‘దేవుడు బాల్యంలో ఫోటో ఇది’ అని ఒకరు కామెంట్‌  చేయగా,  ‘ పిల్లాడు క్రికెట్‌ గతినే మార్చేశాడు’ అని మరొకరు రిప్లై ఇచ్చారు. (చదవండి: 'అనుష్క జీ.. ఆయన వయసుకు గౌరవమివ్వండి')

16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్‌ టెండూల్కర్‌ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అందులో అంతర్జాతీయ ఫార్మాట్‌లో 100 సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. 1989లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన సచిన్‌.. 2013లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు.  2011లో ధోని సారథ్యంలోని వన్డే వరల్ఢ్‌కప్‌ గెలిచిన జట్టులో సచిన్‌ సభ్యుడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top