Road Safety World Series: సచిన్‌ అరుదైన లాఫ్టెడ్‌ షాట్‌.. వీడియో వైరల్‌!

 Sachin Tendulkar Plays Lofted Shot During Road Safety World Series - Sakshi

టీమిండియా క్రికెట్‌ దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చాన్నాళ్ల తర్వాత తిరిగి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌కు సచిన్‌ సారథ్యం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌ వేదికగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్‌ తలపడింది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సచిన్‌ కేవలం16 పరుగులే చేసినప్పటికి.. తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో మాత్రం అభిమానులను అలరించాడు. మఖాయ ఎంటిని బౌలింగ్‌లో లాఫ్టెడ్‌తో షాట్‌తో మరోసారి తన క్లాస్‌ను లిటిల్‌ మాస్టర్‌ చూపించాడు. సచిన్‌ ఆ షాట్‌ కొట్టిన వెంటనే ఒక్క సారిగా స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..సౌతాఫ్రికా లెజెండ్స్‌పై  61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్‌ ఘన విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా లెజెండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.  భారత బ్యాటర్లలో స్టువర్ట్‌ బిన్నీ 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది.

చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top