హర్మూజ్‌లో తేలుతున్న ఐ ఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు | Iphones Luxury Perfume Bottles Float In Hormuz | Sakshi
Sakshi News home page

హర్మూజ్‌లో తేలుతున్న ఐ ఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు

Oct 15 2026 3:26 PM | Updated on Oct 15 2026 3:43 PM

Iphones Luxury Perfume Bottles Float In Hormuz

హర్మూజ్‌ జలసంధిలో కార్గో నౌక.. మైన్‌ను ఢీకొని మునిగిపోయిన సంగతి తెలిసిందే. సముద్రంలో అలలపై తేలుతున్న ఐఫోన్‌లు.. ఖరీదైన పెర్ఫ్యూమ్ బాటిళ్లు.. ఓ వైరల్ వీడియో వెలుగులోకి వచ్చింది. సముద్రంలో మునిగిన ఓ కార్గో నౌక నుంచి బయటపడిన సరుకులివి.. వేలాది కంటైనర్లతో వెళ్తున్న నౌక నీట మునగడంతో విలాసవంతమైన వస్తువులన్నీ సముద్రంలో చెల్లాచెదురుగా తేలుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

యూఏఈకి చెందిన కార్గో నౌకలో 2,500కు పైగా కంటైనర్లు ఉన్నాయని ఇరాన్ తెలిపింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ జలమార్గంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్న పడవల్లో వచ్చిన కొందరు వ్యక్తులు నీటిపై తేలుతున్న వస్తువులను సేకరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సింగపూర్ జెండాతో ప్రయాణిస్తున్న కంటైనర్ నౌక(జిఎఫ్ఎస్ ప్రైడ్) ఈ వస్తువులను దుబాయ్ నుంచి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

బుధవారం ఈ నౌక.. మైన్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి.. చివరకు సముద్రంలో మునిగిపోయింది. నౌకలోని 21 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రకారం.. ఈ నౌకలో సుమారు 2,500 కంటైనర్లు ఉన్నాయి. అనుమతి లేని మార్గంలో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ కార్గో నౌక సముద్రపు మైన్‌ను ఢీకొట్టింది.

ఇరాన్‌ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చెబుతోంది. అయితే, సముద్రయాన అధికారులు మాత్రం నౌకను గుర్తుతెలియని ప్రక్షేపకం ఢీకొట్టినట్లు తెలిపారు. దీంతో నౌక మునిగిపోవడానికి అసలు కారణం ఏమిటన్న అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ నౌక మునిగిపోవడం కలకలం రేపుతోంది.

గత 10 రోజులుగా హర్మూజ్‌ జలసంధి పరిసరాల్లో వాణిజ్య నౌకలపై దాడులు తీవ్రతరమయ్యాయి. తమ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనం.. గత నెలలో కఠినతరం చేసిన ఆంక్షలకు ప్రతిస్పందనగా దాడులను పెంచుతున్నట్లు ఇరాన్ చెబుతోంది. ఈ పరిణామాలు వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధి భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. యుద్ధానికి ముందు ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురు, సహజ వాయువు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ జలమార్గం గుండానే రవాణా అయ్యేది.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. వాషింగ్టన్‌పై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా సముద్ర రవాణాను పరిమితం చేస్తోంది. ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకలపై కొత్త తరహా దాడి వ్యూహాలను అమలు చేస్తున్నట్లు ఇరాన్ వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

ఇదీ చదవండి: పాక్‌ డబుల్‌ గేమ్‌.. దాయాది పిల్లిమొగ్గలు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement