breaking news
India Legends
-
ఆ టోర్నీలో టీమిండియాతో పాటు పాక్ కూడా పాల్గొంటుంది..!
దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో (మూడో ఎడిషన్) దాయాది పాకిస్తాన్ తొలిసారి పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చినట్లు సమాచారం. పాక్ జట్టులో ఎవరెవరు ఉంటారన్నది తెలియాల్సి ఉంది. భారత్, పాక్ సహా మొత్తం 9 దేశాల జట్లు పాల్గొనే ఈ సిరీస్‌లో ఆయా దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు కూడా పాల్గొంటారు. ఈ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా సెప్టెంబర్‌లో జరుగనుంది. మూడు వారాల పాటు సాగే ఈ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జాక్ కలిస్, జాంటీ రోడ్స్, మఖాయ ఎన్తిని, రాస్ టేలర్, కెవిన్ పీటర్సన్, సనత్ జయసూర్య, బ్రెట్ లీ, తిలకరత్నే దిల్షన్, షేన్ వాట్సన్ లాంటి దిగ్గజాలతో పాటు మాజీ అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటారు. రెండు సీజన్ల పాటు భారత్‌లో విజయవంతంగా సాగిన ఈ సిరీస్‌ను నిర్వహకులు ఈసారి ఇంగ్లండ్‌లో ప్లాన్ చేయడంతో పాక్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ వెలువడాల్సి ఉంది. ఈ సిరీస్ తొలి ఎడిషన్ కోవిడ్ కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో జరగగా.. 2022 ఎడిషన్ నిరాటంకంగా ఒకే దశలో జరిగింది. ఈ రెండు ఎడిషన్లలో టీమిండియానే విజేతగా నిలిచింది. రెండు ఎడిషన్ల ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత జట్టు శ్రీలంకను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. తొలి ఎడిషన్ తొలి దశలో భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లతో పాటు ఆస్ట్రేలియా జట్టు పాల్గొనగా.. కోవిడ్ నిబంధనల కారణంగా ఆతర్వాత జరిగిన మలి దశలో ఆసీస్ జట్టు పాల్గొనలేదు. అయితే 2021లో జరిగిన మలి దశ సిరీస్‌లో ఆసీస్ స్థానంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు బరిలోకి దిగాయి. అనంతరం 2022లో జరిగిన సెకెండ్ ఎడిషన్‌లో ఏకంగా 8 దేశాల జట్లు పాల్గొన్నాయి. తొలి ఎడిషన్‌లో పాల్గొన జట్లతో పాటు అదనంగా కివీస్ ఈ ఎడిషన్‌లో పాల్గొంది. 2023 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొనే జట్లు.. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ -
సెంచరీతో చెలరేగిన నమన్ ఓజా.. ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శనివారం శ్రీలంక లెజెండ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ నమన్ ఓజా సెంచరీతో (71 బంతుల్లో 108 నాటౌట్, 15 ఫోర్లు, 2 సిక్సర్లు)చెలరేగాడు. దీంతో ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సెమీఫైనల్లో సెంచరీకి 10 పరుగుల దూరంలో ఆగిపోయిన నమన్ ఓజా.. ఈసారి మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోలేదు. ఆరంభంలోనే సచిన్ టెండూల్కర్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినప్పటికి.. సురేశ్ రైనా 4 పరుగులు చేసి ఔటైనప్పటికి.. ఒక ఎండ్‌లో మత్రం నమన్ ఓజా ఇన్నింగ్స్‌ను ధాటిగా కొనసాగించాడు. లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు. నమన్ ఓజాకు జతగా వినయ్‌కుమార్(21 బంతుల్లో 36 పరుగులు) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. వినయ్ కుమార్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ 13 బంతుల్లో 19 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ నమన్ ఓజా 68 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేయడంలో నమన్ ఓజా కీలకపాత్ర పోషించాడు. లంక లెజెండ్స్ బౌలర్లలో నువాన్ కులశేఖర మూడు వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా రెండు వికెట్లు, ఇషాన్ జయరత్నే ఒక వికెట్ తీసుకున్నాడు. Naman Ojha smashed 108* runs from 71 balls including 15 fours and 2 sixes in the Road Safety World Series final 2022, a terrific knock to remember. pic.twitter.com/F4gNjjgNyf — Johns. (@CricCrazyJohns) October 1, 2022 చదవండి: థర్డ్ అంపైర్ చీటింగ్.. టీమిండియా క్రికెటర్‌కు అన్యాయం -
RSWS 2022 Final: వెస్టిండీస్‌కు పరాభవం.. ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్
RSWS 2022- Sri Lanka Legends vs West Indies Legends, Semi-final 2: సమిష్టి ప్రదర్శనతో శ్రీలంక లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్(ఆర్ఎస్డబ్ల్యూఎస్)- 2022 ఫైనల్‌కు చేరుకుంది. వెస్టిండీస్ లెజెండ్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించి.. ఇండియా లెజెండ్స్‌తో తుదిపోరుకు సిద్ధమైంది. ఆల్‌రౌండర్లు ఇషాన్ జయరత్నె(19 బంతుల్లో 31 పరుగులు), నువాన్ కులశేఖర జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా ఆర్ఎస్డబ్ల్యూఎస్ సెమీఫైనల్-2లో శ్రీలంక లెజెండ్స్- వెస్టిండీస్ లెజెండ్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రాణించిన జయరత్నె బ్రియన్ లారా బృందం ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది దిల్షాన్ సేన. ఓపెనర్లు మహేల ఉదవటె(15), సనత్ జయసూర్య(26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తిలకరత్నె దిల్షాన్ మాత్రం(12 బంతుల్లో ఏడు పరుగులు) విఫలమయ్యాడు. ఇక ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగిన ఇషాన్ జయరత్నె మెరుపులు మెరిపించగా.. జీవన్ మెండిస్ 25 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. పాపం నర్సింగ్! ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ టాపార్డర్ రాణించినప్పటికీ.. మిడిలార్డర్ కుప్పకూలింది. దీంతో వన్‌డౌన్ బ్యాటర్ నర్సింగ్ డియోనరైన్ ఒంటరి పోరాటం(39 బంతుల్లో 63 పరుగులు) వృథాగా పోయింది. 158 పరుగులకే విండీస్ ఆలౌట్ కాగా.. శ్రీలంక 14 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. కీలక వికెట్లు పడగొట్టిన నువాన్ కులశేఖర(4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక శ్రీలంక లెజెండ్స్ శనివారం(అక్టోబరు 1) నాటి ఫైనల్లో ఇండియా లెజెండ్స్‌తో తలపడనుంది. చదవండి: National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. Pak Vs Eng 6th T20: పాక్ బౌలర్లకు చుక్కలు.. 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సాల్ట్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో పాక్ చిత్తు -
చెలరేగిన నమన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్.. ఫైనల్లో ఇండియా లెజెండ్స్
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో ఇండియా లెజెండ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా లెజెండ్స్ ఓపెనర్ నమన్ ఓజా (90 పరుగులు నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో ఇర్ఫాన్ పఠాన్ (37 పరుగులు నాటౌట్) మెరుపులు మెరిపించాడు. వాస్తవానికి బుధవారమే ఈ మ్యాచ్ పూర్తవ్వాల్సింది. కానీ ఆస్ట్రేలియా లెజెండ్స్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. వర్షం ఎంతకు తెరిపినివ్వకపోవడంతో ఆటను గురువారం కూడా కంటిన్యూ చేశారు. బుధవారం వర్షం అంతరాయం కలిగించే సమయానికి 17 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. కాగా గురువారం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 3 ఓవర్లు ఆడింది. మొత్తం 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బెన్ డక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో కామెరున్ వైట్ 30, బ్రాడ్ హడిన్ 12 పరుగులు చేశారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 10 పరుగులు చేసిన టెండూల్కర్ రీయర్డన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా(11) కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్(18)తో కలిసి నమన్ ఓజా(62 బంతుల్లో 90 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. యువీ, బిన్నీ, యూసఫ్ పఠాన్లు వెనుదిరగడంతో ఇండియా లెజెండ్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇర్ఫాన్ పఠాన్( 12 బంతుల్లో 37 నాటౌట్, 2 ఫోర్లు) మెరుపులు మెరిపించగా.. నమన్ ఓజా చెలరేగాడు. 10 పరుగుల దూరంలో సెంచరీ దూరమైనప్పటికి నమన్ ఓజా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 19.2 ఓవర్లలో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య సెమీఫైనల్-2 మ్యాచ్ విజేతతో ఇండియా లెజెండ్స్ ఫైనల్ ఆడనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న(శనివారం) జరగనుంది. Naman Ojha and Irfan Pathan guided India Legends towards a comfortable win against Australia Legends 🇮🇳🙌🏻#rsws #indialegends pic.twitter.com/qXrgq5MFH6 — Sportskeeda (@Sportskeeda) September 29, 2022 చదవండి: సెంచరీతో చెలరేగిన విండీస్ హిట్టర్.. ఫైనల్లో జమైకా తలైవాస్ సురేష్ రైనా స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే! -
సురేష్ రైనా స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే!
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ప్రపంచ ఉత్తమ ఫీల్డర్లలో ఒకడు. అతడు క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ.. తన ఫీల్డింగ్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదు. తాజాగా సంచలన క్యాచ్‌తో రైనా మరోసారి మెరిశాడు. రైనా ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ లీగ్ సెమీఫైనల్-1లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో రైనా ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అభిమాన్యు మిథున్ బౌలింగ్‌లో.. బెన్ డంక్ పాయింట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న రైనా.. డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. రైనా స్టన్నింగ్ క్యాచ్‌తో బ్యాటర్‌తో పాటు భారత ఫీల్డర్లందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సురేష్ రైనా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అదే విధంగా ఇటీవల అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రైనా వీడ్కోలు పలికాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన కెప్టెన్ సచిన్.. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వనించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అయితే వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను గురువారానికి వాయిదా వేశారు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. What a dive. What a catch 😱✨@ImRaina you beauty ♥️ Dekhte rahiye @India__Legends vs @aussie_legends in the #RoadSafetyWorldSeries now, only on @Colors_Cineplex, @justvoot, Colors Cineplex Superhits and @Sports18. pic.twitter.com/gXMHxd1KTy — Colors Cineplex (@Colors_Cineplex) September 28, 2022 చదవండి: Abu Dhabi T10 League: రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ10 లీగ్‌లో ఆడనున్న మిస్టర్ ఐపీఎల్! -
ఆ ఒక్క సిక్స్‌తో '1998 షార్జా'ను గుర్తుచేశాడు
టీమిండియా దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సచిన్ బ్యాటింగ్ జోరును ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 ఏళ్ల వయసులో భారీ షాట్లతో విరుచుకుపడి అభిమానులకు వింటేజ్ సచిన్‌ను గుర్తుచేశాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తాజాగా ఈ మ్యాచ్‌లో సచిన్ కొట్టిన మూడు సిక్సర్లు వేటికవే స్పెషల్ అని చెప్పొచ్చు. అయితే క్రిస్ ట్రెమ్లెట్ బౌలింగ్‌లో అతను కొట్టిన ఒక సిక్స్ మాత్రం 1998 షార్జాను గుర్తుచేసింది. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌ను అభిమానులు ముద్దగా ''Desert Strome'' అని పిలుచుకున్నారు. ఆ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సచిన్ కళ్లు చెదిరే సిక్సర్లతో మెరిశాడు. అందులో ఫ్రంట్‌పుట్ వచ్చి స్ట్రెయిట్ సిక్సర్ బాదడం అప్పట్లో ఒక ట్రేడ్‌మార్క్‌గా నిలిచిపోయింది. ఇలాంటి షాట్లు సచిన్ కొడుతుంటే అభిమానులు ఉర్రూతలూగిపోయేవాళ్లు. ట్రెమ్లెట్ బౌలింగ్‌లో 6,6,4 బాదిన సచిన్.. ఆ ఓవర్లో మొత్తంగా 16 పరుగులు పిండుకున్నాడు. ఇక సచిన్ షార్జా 1998 గుర్తుచేస్తూ.. ఫ్రంట్‌ఫుట్ వచ్చి స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు. దీంతో అభిమానులు 1998 షార్జా, ప్రస్తుతం సచిన్ కొట్టిన సిక్సర్లను ఒకే ఫ్రేమ్‌లో జోడించి ట్వీట్స్ చేశారు. ''సచిన్ సిక్సర్లు చూస్తుంటే మనం 1998లో ఉన్నామా''.. ''వింటేజ్ సచిన్‌ను తలపిస్తున్నాడు'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 40 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 15 ఓవర్లకు కుదించారు. సచిన్ మెరుపులకు యువరాజ్ విధ్వంసం తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెజెండ్స్ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. 𝗦𝗵𝗮𝗿𝗷𝗮𝗵 𝟮.𝟬 😍🙌🔟🏏 whattttt a playerrr 💙@sachin_rt turning back the clock 🕰️🔄#RoadSafetyWorldSeries #sachintendulkar #sharjah #GOAT #God pic.twitter.com/DflUaugI4N — Ashish Verma (@ashu112) September 22, 2022 Vintage Sachin Tendulkar pic.twitter.com/qvogWLkVqC — Sachin Tendulkar🇮🇳FC (@CrickeTendulkar) September 22, 2022 చదవండి: ఒకే ఫ్రేమ్‌లో ఆ 'నలుగురు'.. షేక్ అవుతున్న ఇంటర్నెట్ సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 40 పరుగులతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 15 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (20 బంతుల్లో 40 పరుగులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో యువరాజ్ సింగ్(15 బంతుల్లో 31 పరుగులు నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ 11 బంతుల్లో 27 పరుగులతో అలరించారు. ఇంగ్లండ్ లెజెండ్స్ బౌలింగ్‌లో ఎస్ పారీ మూడు వికెట్లు తీయగా.. స్కోఫీల్డ్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ లెజెండ్స్ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్ కీపర్ ఫిల్ మస్టర్డ్ 29 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. క్రిస్ ట్రెమ్లెట్ 24 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఇండియా లెజెండ్స్ బౌలర్లలో రాజేశ్ పవార్ 3, స్టువర్ట్ బిన్నీ, ప్రగ్యాన్ ఓజా, మన్‌ప్రీత్ గోనీ తలా ఒక వికెట్ తీశారు. 40 పరుగులతో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన సచిన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. చదవండి: గోల్డ్ మెడల్‌తో సర్ప్రైజ్ చేసిన హాలీవుడ్ హీరో 'బ్యాట్‌తోనే సమాధామిచ్చాడు.. పిచ్చి రాతలు మానుకోండి' -
ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్ రద్దు
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండో ఎడిషన్ (2022)లో భాగంగా ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య జట్ల మధ్య కాన్పూర్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 14) జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ రద్దైంది. భారీ వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన భారత్.. తాజాగా లభించిన ఒక్క పాయింట్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన శ్రీలంక (4 పాయింట్లు) టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా.. వెస్టిండీస్ (3), సౌతాఫ్రికా (2), ఇంగ్లండ్ (0), బంగ్లాదేశ్ (0), ఆస్ట్రేలియా (0), న్యూజిలాండ్ (0) జట్లు వరుసగా మూడు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. సౌతాఫ్రికాను 61 పరుగుల భారీ తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ (42 బంతుల్లో 82 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా లెజెండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. టోర్నీలో భాగంగా రేపు (సెప్టెంబర్ 15) జరుగబోయే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ లెజెండ్స్ జట్టు.. న్యూజిలాండ్ లెజెండ్స్‌ను ఢీకొట్టనుంది. -
సచిన్ అరుదైన లాఫ్టెడ్ షాట్.. వీడియో వైరల్!
టీమిండియా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాన్నాళ్ల తర్వాత తిరిగి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌కు సచిన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సచిన్ కేవలం16 పరుగులే చేసినప్పటికి.. తన ట్రేడ్ మార్క్ షాట్లతో మాత్రం అభిమానులను అలరించాడు. మఖాయ ఎంటిని బౌలింగ్‌లో లాఫ్టెడ్తో షాట్‌తో మరోసారి తన క్లాస్‌ను లిటిల్ మాస్టర్ చూపించాడు. సచిన్ ఆ షాట్ కొట్టిన వెంటనే ఒక్క సారిగా స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..సౌతాఫ్రికా లెజెండ్స్‌పై 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టువర్ట్ బిన్నీ 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. Sachin Tendulkar in action#sachin #SachinTendulkar #LegendsLeagueCricket #IndiaLegends #RoadSafetyWorldSeries2022 @mohsinaliisb pic.twitter.com/CimxmF7Rr9 — abhijeet Gautam (@gautamabhijeet1) September 10, 2022 చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
స్టువర్ట్ బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను ఇండియా లెజెండ్స్ విజయంతో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయ భేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు సురేశ్‌రైనా(33), యుసఫ్ పఠాన్(35) పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 పరుగులు మాత్రమే చేశాడు. సౌతాఫ్రికా లెజెండ్స్ బౌలర్లలో వాండర్వాత్ 2, ఎడ్డీ లీ, ఎన్తిని చెరొక వికెట్ తీశారు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో జాంటీ రోడ్స్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో రాహుల్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ఇండియా లెజెండ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో వెస్టిండీస్ లెజెండ్స్‌తో సెప్టెంబర్ 14న తలపడనుంది. చదవండి: Naseem Shah-Uravashi Rautela: 'ఊర్వశి రౌతేలా ఎవరో కూడా తెలియదు'.. కుండబద్దలు కొట్టిన పాక్ పేసర్