Road Safety World Series 2022: సచిన్‌ క్లాస్‌..యువీ మాస్‌; ఇండియా లెజెండ్స్‌ ఘన విజయం

RSWS 2022: India Legends Beat England Legends By 40 Runs - Sakshi

రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ 40 పరుగులతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 15 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా లెజెండ్స్‌ నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (20 బంతుల్లో 40 పరుగులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. చివర్లో యువరాజ్‌ సింగ్‌(15 బంతుల్లో 31 పరుగులు నాటౌట్‌, 1 ఫోర్‌, 3 సిక్సర్లు), యూసఫ్‌ పఠాన్‌ 11 బంతుల్లో 27 పరుగులతో అలరించారు. ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ బౌలింగ్‌లో ఎస్‌ పారీ మూడు వికెట్లు తీయగా.. స్కోఫీల్డ్‌ ఒక వికెట్‌ తీశాడు.

అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్‌ కీపర్‌ ఫిల్‌ మస్టర్డ్‌ 29 పరుగులతో టాప్‌ స్కోరర్ కాగా.. క్రిస్‌ ట్రెమ్లెట్‌ 24 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఇండియా లెజెండ్స్‌ బౌలర్లలో రాజేశ్‌ పవార్‌ 3, స్టువర్ట్‌ బిన్నీ, ప్రగ్యాన్‌ ఓజా, మన్‌ప్రీత్‌ గోనీ తలా ఒక వికెట్‌ తీశారు. 40 పరుగులతో మ్యాచ్‌లో​ కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సచిన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

చదవండి: గోల్డ్‌ మెడల్‌తో సర్‌ప్రైజ్‌ చేసిన హాలీవుడ్‌ హీరో​

'బ్యాట్‌తోనే సమాధామిచ్చాడు.. పిచ్చి రాతలు మానుకోండి'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top