Christiano Ronaldo: రొనాల్డోకు బంపరాఫర్‌ .. ఏడాదికి రూ.612 కోట్లు!

Ronaldo Receives 225 Million dollars Offer To Join Saudi Giants Al Nassr: Reports - Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో తెగదింపులు చేసుకున్న సంగతి తెలిసిందే. క్లబ్‌తో పాటు ఆ జట్టు మేనేజర్‌పై తీవ్ర విమర్శలు చేసిన రొనాల్డోను మాంచెస్టర్ యునైటెడ్ ఉద్వాసన పలికింది. అయితే మాంచెస్టర్‌తో బంధం తెంచుకున్న రొనాల్డోకు సౌదీ అరేబియాకు చెందిన ఫుట్‌బాల్‌ క్లబ్‌ అల్ నసర్‌ బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సీబియస్‌ రిపోర్ట్‌ ప్రకారం.. రోనాల్డోకు అల్ నసర్‌ క్లబ్‌కు మూడేళ్లకు 225 మిలియన్‌ డాలర్లు(అంటే భారత కరన్సీ ప్రకారం సుమారు రూ. 1840 కోట్లు) చెల్లించేందుకుసిద్దంగా ఉంది.

అం‍టే ఏడాదికి 75 మిలియన్‌ డాలర్లు (భారత కరన్సీ ప్రకారం సుమారు రూ. 612 కోట్లు). కాగా రోనాల్డో ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్‌-2022లో ఆడుతున్నాడు. అయితే రోనాల్డో కూడా అల్ నసర్‌ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఇక అల్ నసర్‌ ఆసియాలోని అత్యంత విజయవంతమైన క్లబ్‌లలో ఒకటి.  ఇప్పటి వరకూ ఈ క్లబ్‌ తొమ్మిది లీగ్‌ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది.
చదవండిRuturaj Gaikwad: చరిత్ర సృష్టించిన రుతురాజ్.. 7 బంతుల్లో 7 సిక్స్‌లు! ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top