IND VS BAN 1st Test: టీమిండియా కెప్టెన్‌ ఎవరంటే..?

Rohit Sharma Ruled Out Of 1st Test Vs Bangladesh - Sakshi

బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా గాయపడి మూడో వన్డేకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. టెస్ట్‌ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (డిసెంబర్‌ 11) అధికారికంగా ప్రకటించింది. హిట్‌మ్యాన్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌  కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, అతని స్థానాన్ని అభిమన్యు ఈశ్వరన్‌ భర్తీ చేస్తాడని పేర్కొంది. కాగా, గాయాల కారణంగా మహ్మద్‌ షమీ, రవీంద్ర జడేజా ఇదివరకే జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వీరి స్థానంలో నవ్‌దీప్‌ సైనీ, సౌరభ్‌ కుమార్‌ జట్టులో చేరారు.

ఇదిలా ఉంటే, రోహిత్‌ స్థానంలో టీమిండియాకు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్‌..  ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత-ఏ జట్టుకు సారధిగా వ్యవహిస్తున్నాడు. బంగ్లాతో అనధికారిక టెస్టు సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఈశ్వరన్‌ను బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసింది. డిసెంబర్‌ 14 నుంచి భారత్‌-బంగ్లా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత్‌.. రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. 

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్‌ గిల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, సౌరభ్‌ కుమార్‌, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శ్రీకర్‌ భరత్‌ (వికెట్‌కీపర్‌), రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవ్‌దీప్‌ సైనీ 
 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top