సెమీఫైనల్లో రోహన్‌ బోపన్న జోడీ  | Rohan Bopanna pair in the semifinals | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో రోహన్‌ బోపన్న జోడీ 

Feb 23 2023 3:00 AM | Updated on Feb 23 2023 3:00 AM

Rohan Bopanna pair in the semifinals - Sakshi

ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీ లో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 1–6, 6–4, 11–9తో భారత్‌కే చెందిన సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ  జంటను ఓడించింది.

74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. సాకేత్‌–యూకీలకు 12,750 డాలర్ల (రూ. 10 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement