Rishabh Pant Likely To Miss ODI WC 2023, BCCI Official Confirms - Sakshi
Sakshi News home page

రిషబ్‌ పంత్‌ హెల్త్‌ అప్‌డేట్‌.. టీమిండియాకు షాకింగ్‌ న్యూస్‌

Jan 15 2023 10:10 AM | Updated on Jan 15 2023 10:46 AM

Rishabh Pant Likely To Miss ODI WC 2023, BCCI Official Confirms - Sakshi

Rishabh Pant Likely To Miss ODI WC 2023: కారు ప్రమాదానికి గురైన భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సాధారణ స్థితికి రావడానికే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాతే ఫిట్‌నెస్, ఆట గురించి ఆలోచించగలిగేది!

ఈ నేపథ్యంలో పంత్‌ స్వదేశంలో అక్టోబర్‌–నవంబర్‌లలో జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీతోపాటు 2023 మొత్తం సీజన్‌కు దూరమయ్యే చాన్స్‌ ఉంది. పంత్‌ కుడి మోకాలిలో మూడు లిగ్మెంట్‌లు బాగా దెబ్బ తినగా...రెండింటిని శస్త్ర చికిత్సతో చక్కదిద్దారు. మరో ఆరు వారాల్లో పంత్‌కు మరో కీలక సర్జరీ జరుగనున్నట్లు బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement