ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆటగాడు వచ్చేస్తున్నాడు

Rishabh Pant comeback earlier than expected as superstar returns to NCA - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ  భారత స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే పనిలో పడ్డాడు. పంత్‌ ప్రస్తుతం బెంగళూరులోని  నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. పంత్‌ తన పూర్వ వైభవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు మరో రెండు మూడు నెలల్లో తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు దృవీకరించారు.

"పంత్‌కు ఇప్పటికే పలు పలు సర్జరీలు జరిగాయి. అయితే అతడికి మరో మైనర్‌ సర్జరీ అవసరమని తొలుత భావించారు. అతడిని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వైద్యులు చెకప్‌ చేశారు. పంత్‌ ప్రస్తుతం బాగా కోలుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అతడికి మరి ఎటువంటి సర్జరీలు అవసరమలేదని వైద్యలు నిర్ణయించారు.

ఇది భారత క్రికెట్‌కు చాలా మంచి వార్త. పంత్‌ మనం​ మొదట ఊహించిన దాని కంటే ముందుగానే మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది" అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. కాగా భారత్‌ వేదికగా జరగనున్న ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో పంత్‌ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక గతేడాది డిసెంబర్‌ నుంచి పంత్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌-2023తో పాటు వరల్డ్‌టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూరమయ్యాడు.
చదవండి: ఏంటీ విభేదాలా? మహీ అన్న.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే: జడేజా ట్వీట్‌ వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top