నన్ను రిటైన్ చేసుకోకపోవడానికి అది కారణం కాదు: రిషబ్ పంత్ | Rishabh Pant breaks silence on not being retained by Delhi | Sakshi
Sakshi News home page

నన్ను రిటైన్ చేసుకోకపోవడానికి అది కారణం కాదు: రిషబ్ పంత్

Nov 19 2024 1:44 PM | Updated on Nov 19 2024 4:14 PM

Rishabh Pant breaks silence on not being retained by Delhi

ఐపీఎల్‌​-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ త‌న అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంతో రిషబ్ వేలంలోకి వచ్చాడు.

ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా పంత్‌ త‌న పేరును న‌మోదు చేసుకున్నాడు. రిషబ్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉండడంతో ఈ మెగా వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది.

క్లారిటీ ఇచ్చిన పంత్‌..
అయితే ఈ ఏడాది సీజన్‌లో పంత్ అద్బుతం‍గా రాణించినప్పటికి ఢిల్లీ ఎందుకు వేలంలోకి విడిచిపెట్టిందో ఎవ‌రికి ఆర్ధం కావ‌డం లేదు. ఢిల్లీ మేనెజ్‌మెంట్‌తో విభేదాల కార‌ణంగానే పంత్ బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

అతడు ఎక్కువ డబ్బు అడిగిన కారణంగానే ఢిల్లీ విడిచిపెట్టిందని మరి కొన్ని రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. తాజాగా ఇదే విషయంపై రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనను జట్టులో ఉంచుకోకపోవడానికి డబ్బు కారణం కాదని కచ్చితంగా నేను చెప్పగలను అని ఎక్స్‌లో రిషబ్ పోస్ట్ చేశాడు.

కాగా ఐపీఎల్‌-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ సపోర్ట్‌ స్టాప్‌లో సమూల మార్పులు చేసింది. ఢిల్లీ తమ హెడ్‌కోచ్‌గా  రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని, సౌరవ్ గంగూలీ ప్లేస్‌లో వేణుగోపాల్ రావును క్రికెట్ డైరెక్టర్‌గా నియమించింది. ఇక ఐపీఎల్‌ మెగా వేలం నవంబర్‌ 24, 25వ తేదీల్లో జెడ్డా వేదికగా జరగనుంది.


చదవండి: BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌దే పైచేయి.. ఆసీస్‌కు మరోసారి సవాల్‌?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement