ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో పంత్‌.. మాస్క్‌ లేదంటూ ప్రశ్నల వర్షం

Rishab Pant Enjoy England Vs Germany Football Match Became Viral - Sakshi

లండన్‌: ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిసిన త‌ర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు చాలా సమయం ఉండడంతో ఆటగాళ్లంతా లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి త‌న భార్య అనుష్క శర్మతో కలిసి సరదాగా గడుపుతుంటే.. వైస్‌ కెప్టెన్లు రోహిత్‌, రహానేలు మాత్రం తమ కుటుంబసభ్యులతో యూకేలో అందమైన ప్రదేశాలను చూస్తు ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ వీరికి భిన్నంగా రిషభ్‌ పంత్‌ మాత్రం యూరో 2020 కప్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేస్తూ కనిపించాడు.

కాగా మంగ‌ళ‌వారం రాత్రి లండ‌న్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్‌, జ‌ర్మనీ మ‌ధ్య జ‌రిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్ వీక్షించడానికి వెళ్లాడు. త‌న ముగ్గురు ఫ్రెండ్స్‌తో క‌లిసి వెళ్లిన పంత్ మ్యాచ్‌ సందర్భంగా సెల్ఫీల‌తో సంద‌డి చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఇంగ్లండ్‌, జర్మనీ మ్యాచ్ చూడ‌టం మంచి అనుభూతిని క‌లిగించిందంటూ పంత్‌ ట్వీట్ చేశాడు. ఇక ఇంగ్లండ్‌లో డెల్టా వేరియంట్‌ కేసులు ఎక్కువగా కలవరపెడుతున్నాయి. మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఎక్కువశాతం మాస్క్‌ ధరించకుండానే వచ్చారు. అభిమానులు కూడా పంత్‌ ట్వీట్‌పై కాస్త భిన్నంగా స్పందించారు. '' ఏ టీమ్‌కు స‌పోర్ట్ చేశావ‌ని ఒక‌రు.. మాస్క్ ఎందుకు పెట్టుకోలేద‌ని'' మ‌రొక‌రు కామెంట్‌ చేశారు.  కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు 2-0తో జ‌ర్మనీని ఓడించింది. 

ఇక కివీస్‌తో జరిగిన ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో రిషబ్‌ పంత్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసినా చివరి వరకు నిలబడకపోవడంతో టీమిండియా తక్కువ స్కోరుకే ఆలౌటై కివీస్‌ చేతిలో పరాజయం పాలైంది. తద్వారా డబ్ల్యూటీసీ తొలి టైటిల్‌ను కివీస్‌ గెలుచుకుంది. ఇక ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది.

చదవండి: రాజీవ్‌ఖేల్‌రత్న రేసులో అశ్విన్‌, మిథాలీ రాజ్‌

జెర్సీని వేలం వేయనున్న టిమ్‌ సౌథీ.. కారణం ఏంటంటే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top